జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించాలి
-వర్కింగ్ జర్నలిస్టులందరికి రూ.10 లక్షలు ప్రమాద భీమా పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలి
-జర్నలిస్టుల చిరకాల స్వప్నంను నిజం చేయాలి
-జర్నలిస్టుగా పనిచేస్తున్న వారికి నెలకు రూ.10 వేలు చొప్పున పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలి
– రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, బీసీ వెల్ఫేర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ను కలిసిన కేటాయించాలని ఆంధ్ర ప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ప్రతినిధులు
వెలగపూడి : జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, బీసీ వెల్ఫేర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించాలని ఆంధ్ర ప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, బీసీ వెల్ఫేర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను సోమవారం వెలగపూడి సచివాలయంలో కలిసి సోమవారం వినతి పత్రాన్ని సమర్పించారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు బడ్జెట్ లో తక్షణమే నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్న నేపథ్యంలో సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పాత్రికేయుల ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ప్రభుత్వం జీ.వో. ఎం.ఎస్. నెం. 395/2022, తేది: 10-11-2023 ను తీసుకువచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు సమాన ప్రాతిపదికన 0.03 సెంట్ల ఇళ్ల స్థలాల జీ.వో. ఇవ్వడం చారిత్రాత్మకం. ఇంతటి మహోన్నత కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి జర్నలిస్టుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల షెడ్యూలు తరుముకు వస్తున్న నేపథ్యంలో జీ.వో. తో పాటు భూముల కొనుగోలుకు నిధులు కేటాయించి జర్నలిస్టుల చిరకాల స్వప్నంను నిజం చేయాలని కోరారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి జీ.వో. ఎం.ఎస్.నెం. 395/2022, తేది : 10-11-2023 ను తీసుకువచ్చిన ప్రభుత్వం ఇళ్ల స్థలాల భూములు కొనుగోలుకు సంబంధించి నిధులు ఇంతవరకు మంజూరు చేయలేదు. రాష్ట్రంలోని విజయవాడ ప్రాంతంలో తప్ప అనేక జిల్లాలలో అర్హులైన జర్నలిస్టులకు సంబంధించి వెరిఫికేషన్ కూడా రెవిన్యూ అధికారులు పూర్తి చేశారు.
కేవలం భూమి కొనుగోలుకు సంబంధించి నిధులు లేకపోవడంవల్లే స్కీమ్ఆ లస్యమవుతోంది. ఎన్నికల షెడ్యూలు కొద్ది రోజులలో రాబోతున్న దృష్ట్యా జర్నలిస్టులలో ఆందోళన పెరిగిపోతోంది. గత ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఇళ్ల స్థలాల విషయంపై
నమ్మించి మోసం చేసింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందన్న ఆందోళన జర్నలిస్టులలో నెలకొంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న దృష్ట్యా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల భూములు కొనుగోలుకు సంబంధించి తక్షణమే నిధులు
కేటాయింపు చేయవలసిందిగా కోరుతున్నాం.
గతంలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికి రూ.10 లక్షలు ప్రమాద భీమా పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలి. ఎన్నికల దృష్ట్యా జర్నలిస్టుల రక్షణ నిమిత్తం జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీని తక్షణమే పునరుద్ధరించాలి. తమిళనాడు, ఢిల్లీ, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో అమలులో ఉన్న అకాల మరణం పొందిన జర్నలిస్టుల కుటుంబసభ్యులకు అందిస్తున్న పెన్షన్ స్కీమ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. 20 సంవత్సరాలకు పైగా జర్నలిస్టుగా పనిచేస్తున్న వారికి నెలకు రూ.10 వేలు చొప్పున పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలి.
జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించాలని ఆంధ్ర ప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీర్ల శ్రీరామ్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇస్కా రాజేష్ బాబు, నమ్మయ్య, ప్రసాద్ బాబు మంత్రిని కోరారు