ఇంకా పన్ను చెల్లించాలా? ఎందుకు?

– ఇప్పుడు చెప్పండి.. దొంగెవరు?

నేను 30 రోజులు పనిచేశాను. జీతం ఇచ్చారు, జీతం ఇచ్చారు, ఆదాయపు పన్ను అన్నారు, ఇచ్చాను. ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నారు, ఇచ్చాను.

మొబైల్ కొనుగోలు పై పన్ను అన్నారు, ఇచ్చాను. రీఛార్జ్ చేశా, పన్ను ఇచ్చా, డేటా పన్ను ఇచ్చా, విద్యుత్తు పన్ను ఇచ్చా, ఇంటి పన్ను ఇచ్చా, టీ.వీ బిల్లు పై పన్ను, పిల్లల ఫీజుల పై పన్ను అన్నీ ఇచ్చాను. కారు కి పన్ను అన్నారు. పెట్రోలు పై పన్ను అన్నారు, చెల్లించా, ‘సేవ’ అన్నారు – పన్ను అన్నారు, రోడ్డుపై పన్ను అన్నారు, ‘టోల్‌ పై’ పన్ను అన్నారు, ఆపై లైసెన్స్ మేడ్ ‘ట్యాక్స్’ వచ్చింది. ఇచ్చాను. అన్నీ కిక్కురు మనకుండా అన్నీ ఇచ్చాను.

తప్పు చేస్తే పన్ను- చెల్లించా, రెస్టారెంట్‌లో తిన్నా – పన్ను చెల్లించా, పార్కింగ్ పన్ను చెల్లించా, నీరు తీసుకున్నా-పన్ను చెల్లించా, రేషన్ కొనుగోలు చేశా- పన్ను చెల్లించా, బట్టలు కొనుగోలు చేశా – పన్ను చెల్లించా, పుస్తకాలు తీసుకున్నా – పన్ను ఇచ్చా, మరుగు దొడ్డికి వెళ్లా – పన్ను చెల్లించా, మందులు తీసుకున్నా – పన్ను చెల్లించా, గ్యాస్ ఇచ్చారు – పన్ను చెల్లించా. వందల కొద్దీ వస్తువులు తీసుకుని పన్ను కట్టి, ఫీజులు, బిల్లులు, వడ్డీలు కట్టి, ఎక్కడో ఫైన్లు, లంచాల పేరుతో డబ్బులు చెల్లించి, పొరపాటున ఏ డ్రామా నో ఆడి, ఇంతా అంతా ‘ఆదా’ చేసి మరీ మీకు పన్ను కట్టా.

కానీ ఆ జీతం నుండి ఎన్నిసార్లు పన్ను చెల్లించాలి ? ఎవరయినా జవాబు చెప్తారా?
మేము జీవితాంతం పని చేసి, పన్నులు కట్టిన తర్వాత కూడా, సామాజిక భద్రత లేదు, ఉచిత వైద్య సౌకర్యం లేదు, ఉచిత ప్రజా రవాణా లేదు, అధ్వాన్నమైన రోడ్లు, వీధి దీపాలు వెలగవు, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, పండ్లు, కూరగాయలు విషపూరిత మైనవి, ఆసుపత్రుల చికిత్సలు అందనంత ఖరీదైనవి, ప్రతి సంవత్సరం పెరిగే ద్రవ్యోల్బణం కూడా మమ్మల్ని దెబ్బతీస్తుంది, అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు, ప్రమాదవశాత్తు ఊహించని విపత్తులు, వాటిల్లో ప్రతి చోటా కూడా మీకు పన్నులు మాకు అప్పులు.

కానీ ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి….?
అవినీతి లోకి, ఎన్నికల్లోకి, సోమరి పోతులని తయారు చేయడానికి సంక్షేమం పేరిట ఇచ్చే ఉచితాలకి, ధనవంతుల సబ్సిడీల్లోకి, మాల్యా లాంటి వారు దోచుకొని పారి పోవటానికి, ధనికుల ప్రకటించే మోస పూరిత ‘దివాలాలు’ పూడ్చటానికి, స్విస్ బ్యాంకుల్లోకి, నాయకుల బంగ్లాలు, కార్లు, జీతాలు సౌకర్యాలకి, ఎమ్మెల్యేలను కొనడం లోకి, మాకు కథలు చెప్పి జండూ బామ్ రాయడానికి ఖర్చు పెట్టారు.

ఇప్పుడు ఎవరైనా చెప్పండి, దొంగ ఎవరో…..?
మనమంతా కూడా ఈ దేశస్థులమే అయినా సరే, ఎంత కాలం అయినా ఇలాగే జీవితాన్ని కొనసాగిస్తాము….. కదా! ఇది ఒక సామాన్యుడి ఆవేదన.

– భవన్నారాయణ

Leave a Reply