Suryaa.co.in

Telangana

రాహుల్ గాంధీ పై కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా

– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

రాష్ట్ర మంత్రి కేటీఆర్ సభ్యత, సంస్కారం మర్చిపోయి సంస్కారహీనుడిగా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.ఈ దేశానికి ప్రధానమంత్రిగా, కేంద్ర మంత్రిగా అయ్యేటువంటి అవకాశం ఉన్న ఆ పదవులను త్యాగం చేసిన గొప్ప మనిషి రాహుల్ గాంధీ.

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ దేశం సమైక్యంగా ఉండాలని, జాతి విచ్ఛిన్నం కాకూడదని, ఆర్థికంగా, మతపరంగా విభజనతో దేశం రెండు భారతదేశలుగా ఉండకూడదని భారత్ జోడో యాత్రతో ప్రపంచమే ఆయనను చూసే విధంగా, దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ.వ్యవసాయ పంట పొలాల్లోకి వెళ్లి కూలీలతో కలిసి రాహుల్ గాంధీ నాట్లు వేశాడు.

లారీలు ఎక్కి ట్రక్కు డ్రైవర్లతో ప్రయాణం చేసి వారి కష్టాలను తెలుసుకున్నాడు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తూ మెకానిక్ ల జీవితాలను తెలుసుకున్నారు. దేశంలో ఉన్న బడుగు బలహీనులను కలుస్తున్నారు. ప్రజలు పడుతున్న బాధలను నేరుగా తెలుసుకుంటున్నారు.కామెర్లు ఉన్నవాళ్ళకు దేశం పచ్చగా కనబడినట్టు ఎప్పుడూ పబ్బులు, క్లబ్బుల గురించి ఆలోచన చేసే కేటీఆర్ కి వరి నాట్లు వేసే పంట పొలాలు పబ్బు లాగానే కనబడుతున్నాయా?. రాహుల్ గాంధీ మెకానిక్ ల తో మాట్లాడేది క్లబ్బు లాగా కనిపిస్తున్నదా?. దీనిని బట్టి కేటీఆర్ ఏ ప్రపంచంలో బతుకుతున్నాడో అర్థమవుతున్నది.

ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు ఇలా మాట్లాడటం వారి మానసిక స్థితిని తెలుపుతున్నది.రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్బు, క్లబ్, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని పబ్బు, క్లబ్, డ్రగ్స్ కేంద్రంగా మార్చిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది.పబ్బు, క్లబ్బు, డ్రగ్స్ నిర్వహణ వెనుక ఎవరున్నారో.. చాలా సంఘటనలు వెలుగులోకి వచ్చి చర్చ జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

ప్రజా సమస్యల కోసం నిత్యం పరితపిస్తున్న రాహుల్ ఆలోచనలను గమనిస్తే నాయకుడు ఎలా ఉండాలో అర్థం అవుతుంది.తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ దేశంలో పేదలు, రైతులు, కార్మికులు బాగుపడాలని తపిస్తున్న నాయకుడు.అవినీతిలో కూరుకుపోయి అనేక కేసులు ఎదుర్కొంటూ ఢిల్లీకి వెళ్లి అమీత్ షాను కలిసి సెటిల్మెంట్ చేసుకున్న నాయకుడు కాదు రాహుల్ గాంధీ.

ఈ దేశానికి హరిత విప్లవం, శ్వేత విప్లవం, కంప్యూటర్ రెవల్యూషన్ తీసుకువచ్చిన కుటుంబానికి చెందిన గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి.

LEAVE A RESPONSE