సమయం గడిచిపోయింది
కాలం గడిచిపోయింది
ఎలా గడిచిందో తెలియనేలేదు
జీవితమనే..పెనుగులాటలో
తెలియకుండానే వయసు గడిచిపోయింది .
అద్దె ఇంటి నుండి మొదలైన జీవితం.
ఎప్పుడు స్వంతఇంట్లోకి వచ్చామో తెలియదు
ఆయాసంతో సైకిల్ పెడల్ కొడుతూ కొడుతూ
ఎప్పుడు కారులో తిరిగే స్ధాయికి వచ్చామో తెలియదు
నల్లని కురులను చూసుకొని వగలు పోయేవాళ్ళం..
అవన్నీ ఎప్పుడు తెల్లగా మారాయో తెలియదు.
పగలు కూడా హాయిగా నిద్రపోయే వారం
కానీ ఇప్పుడు నిద్ర రాని రాత్రులు ఎన్నో..
ఉద్యోగం కోసం తిరిగి.. చాకిరీ చేసి చేసి….
ఎప్పుడు రిటైర్ అయ్యామో తెలియదు.
పిల్లల కోసం ఎంత తాపత్రయం పడ్డామో..
వాళ్ళు ఎప్పుడు దూరంగా వెళ్లి పోయారో తెలియదు
భుజాలపైకి..ఎక్కే పిల్లలు భుజాలదాక వచ్చేశారు
ఇప్పుడు నాపిల్లలకు నేను బాధ్యత గా మారాను
అన్నదమ్ముల అక్కచెల్లెండ్లతో అన్యొన్యంగా ఉండేవాళ్ళం
ఎప్పుడు వాళ్ళుఅందరూ దూరమయ్యారో తెలియదు.
ఇవన్నీ…..జరిపోయాయి..
కానీ
కాలం ఎలా గడిచిందో తెలియనేలేదు.
– ఎంఆర్‌ఎన్ శర్మ