Suryaa.co.in

Telangana

విద్యార్థులు మరణిస్తున్నా ప్రభుత్వంలో చలనం ఉండదా?

– మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఘటనపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: 20 రోజులకు పైగా చికిత్స పొందుతూ నిన్ననే గురుకుల విద్యార్థిని శైలజ మరణించింది. మళ్లీ ఉమ్మడి పాలమూరు జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. ఆసుపత్రిలో చేరిన 30కి పైగా విద్యార్థులు.ప్రభుత్వ పర్యవేక్షణ లోపమే సమస్యలకు కారణం.

ఏడాది కావస్తున్నా విద్యా శాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖమంత్రుల నియామకానికి దిక్కు లేదు. మంత్రి లేక దారితప్పిన గురుకుల విద్యావ్యవస్ధ .. ప్రభుత్వంలోని అనేక శాఖల మీద పర్యవేక్షణ లేకపోవడం మూలంగానే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆసుపత్రి పాలైన విద్యార్థులకు నాణ్యమైన చికిత్స అందించాలి.

LEAVE A RESPONSE