Suryaa.co.in

Telangana

రేవంత్ ఎల్-3 సీఎం

-అన్నీ లంగా, లఫంగా, లుచ్చా మాటలే
– కేసీఆర్ ‘ దీక్షాదివస్ ‘ ప్రజల బ్రహ్మస్త్రం
-ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించిన నేత కేసీఆర్
-ఆయన పదేళ్ళ పాలన ఒక స్వర్ణ యుగం
-ఇప్పుడు కాంగ్రెస్ పాలన మరో రాతియుగం
-సీఎం రేవంత్ ది బూతులనోరు.. అబద్దాల కోరు
-కాంగ్రెస్ కొమ్ముగాస్తున్న పోలీసులు
-వారి పేర్లను పింక్ బుక్ లో ఎక్కిస్తు న్నాం
-వచ్చేది మళ్లీ కేసీఆర్ సర్కారే
-అందరి లెక్కలు తేలుస్తాం
-‘దీక్షాదివస్’ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి

నిజామాబాద్: రేవంత్ రెడ్డి ఎల్-3సీఎం. లంగా,లఫంగా, లుచ్చా మాటలతో తెలంగాణను ముంచిండు. రైతు బంధు కాంగ్రెస్ రాబందుల పాలయింది. కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి రైతులకు టోపీ పెట్టింది. పెన్షన్లు పెరుగుడు దేవుడెరుగు ఉన్న పెన్షన్లకే మంగళం పాడిండు. పెన్షన్లు ఇవ్వకుండా అవ్వాతాతల, అక్కాచెల్లెళ్ల, విధివంచితుల కడుపు కొట్టిన ఘనుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నికృష్ట పాలనతో ఏడాదిలోనే అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర అసహనం కనిపిస్తోంది.సొంత నియోజకవర్గం కొడంగల్ లోనే రేవంత్ రెడ్డి పై ప్రజలు తిరగబడుతుండ్రు.

నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన కేసీఆర్ ‘దీక్షదివస్’ చారిత్రక ఘట్టం ప్రజల చేతిలో తిరుగులేని బ్రహ్మస్త్రమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఈనెల 29 తేదీన చేపట్టనున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించిన నేత కేసీఆర్ అని అభివర్ణించారు. నాడు తెలంగాణ ద్రోహులను తరిమికొట్టింది ఈ బ్రహ్మాస్త్రమే. నేడు మళ్లీ చిట్టినాయుడి ముసుగులో ఉన్న ద్రోహులను తరిమికొట్టేది ఈ బ్రహ్మాస్త్రమే అని ఆయన అన్నారు.

నాడు తెలంగాణ సాధనలో కేసీఆర్ దీక్షా దివస్ చెరగని సంతకమయితే.. నేడు అనుముల రేవంత్ రెడ్డిది అంతులేని అవినీతి సంతకమన్నారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను భుజానికెత్తుకొని ఏప్రిల్ 27, 2001 నాడు గులాబీ జెండాను ఎగరవేసిన కేసీఆర్ స్వరాష్ట్ర సాధనకు కర్మ,కర్త,క్రియ అని ఆయన అభివర్ణించారు.

కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నవంబర్ 29, 2009 న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిందన్నారు. మళ్లీ ఈ రోజు అవే పరిస్థితులు కనిపిస్తున్నాయని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.అవే నిర్భంధాలు, అవే అణచివేతలు, అవే దుర్భర పరిస్థితుల నేపథ్యం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కనిపిస్తు న్నాయన్నారు.

కేసీఆర్ పదేళ్ళ పాలన ఒక స్వర్ణ యుగం. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మరో రాతియుగం అని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ ది బూతులనోరు. ఆయనొక అబద్దాల కోరు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణకు మళ్లీ అదే అంధకారం వచ్చింది. చిట్టినాయుడి చిల్లర పాలనలో సంపన్న వర్గాల నుంచి అట్టడుగు వర్గాల వరకు అందరూ బాధపడుతున్నారు.

కేసీఆర్ పదేళ్ల పాలనలో పాడి పంటలతో పచ్చబారిన తెలంగాణ గడ్డ నేడు కాంగ్రెస్ ఏడాది పాలనలో మళ్లీ ఎండిపోయింది.
కాంగ్రెస్ కాలకేయుల చేతిలో ప్రజలు దగా పడ్డరు. రేవంత్ రెడ్డి కి దమ్ముంటే ప్రజలకు సమాధానమివ్వాలి. 2లక్షల రుణమాఫీని ఇంకా ఎందుకు పూర్తి చేయలేదు?. రైతులు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15వేల భరోసా ఎందుకు ఇవ్వడంలేదు?. ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి ఇస్తాన్న 12వేలు ఎందుకు ఇవ్వలేదు? పది రకాల పంటలకు ఇస్తామన్న బోనస్ ఏమైంది?.మీ ఏడాది పాలన అంత బాగుంటే అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేసే దుస్థితి ఎందుకు వచ్చింది?.

వద్దురో నాయనా ఈ దగాకోరు కాంగ్రెస్ పాలన అంటూ ప్రజలు ఎందుకు భగ్గుమంటున్నారు?. పురుగుల భోజనం తినలేమని గురుకుల పిల్లలు ఎందుకు వీధిన పడ్డారు?.48మంది విద్యార్థుల మృతిపై ఏం చెబుతారు?. స్కాలర్ షిప్పుల కోసం విద్యార్థులు ఎందుకు పోరాడుతున్నారు?. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎందుకు రోడ్లమీదు కొస్తున్నారు? రుణమాఫీ, రైతు బంధు కోసం రైతన్నలు ఎందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు?.జీతాల కోసం ఆశాలు, అంగన్ వాడీలు ఎందుకు ఉద్యమిస్తున్నారు?.

డీఏ, పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?. నిధులు విడుదల చేయాలంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎందుకు నీ పోలీసులతో లాఠీ దెబ్బలు తింటున్నారు?.
ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు ఎందుకు తిరగబడు తున్నారు?. ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు ఎందుకు మర్ల బడుతున్నారు?.

మూసీ పరివాహక నివాసితులు కాంగ్రెస్ పాలనపై ఎందుకు శాపనార్థాలు పెడుతున్నారు?. సమస్యలు పరిష్కరించాలంటూ పోలీసులు ఎందుకు రోడ్లు ఎక్కారు?. కల్యాణ లక్ష్మీ పథకాన్ని ఎందుకు కాలదోషం పట్టించావు?. మహాలక్ష్మి పథకానికి ఎందుకు చెదపడుతోంది?. నువ్వు ఘనంగా చెప్పిన నిరుద్యోగ భృతి ఏమైంది?. ఇలా నువ్వు మోసం చేయని ప్రజలెవరయినా ఉన్నారా?.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలపై ఆరాచకాలు పెరిగాయి. బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు చేస్తున్నారు. నన్ను కూడా వేధిస్తున్నారు. పోలీసులు అరాచక శక్తులకు కొమ్ము కాస్తున్నారు. అందరి పేర్లు పింక్ బుక్ లో ఎక్కిస్తున్నాం. వచ్చేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే. అందరి లెక్కలు తేలుస్తాం అని ఆయన హెచ్చరించారు. పోవాలి కాంగ్రెస్.. మళ్లీ రావాలి కేసీఆర్ అంటూ దీక్షదివస్ స్పూర్తితో పోరాడుదాం.కాంగ్రెస్ సర్కార్ ను తరిమికొడదాం అని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో దీక్షా దీవాస్ జిల్లా ఇంఛార్జ్ ఫారుక్ హుస్సేన్,మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్, మాజీ ఎమ్మెల్సీ వి.జి గౌడ్, మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావు, సీనియర్ నాయకులు రాజారాం యాదవ్, రాంకిషన్ రావు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE