– చిన్నచిన్న పత్రికలు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి
– అందుకే మరో ఆప్షన్ లేక దాన్ని పగలగొట్టా
– నాకు తెలియకుండానే ఓ ఈద్గా గ్రౌండ్ వద్ద సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు
– ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
హైదరాబాద్ : మిడ్ డే మీల్స్ లో విద్యార్థులకు కోడిగుడ్లు ఇవ్వడం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. కొత్త భవనాల విషయంలో సోషల్ మీడియాలో చిన్నచిన్న పత్రికలు బ్లాక్ మెయిల్ చేస్తున్నా, వాటికి జీహెచ్ఎంసీ అధికారులు భయపడిపోతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా స్పందించని అధికారులు, సోషల్ మీడియా వాళ్లు ఫోన్ చేస్తే మాత్రం భయపడుతున్నారు. అధికారులు, వాళ్లు కలిసి లావాదేవీలు చేసుకుంటున్నారు. వీటిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలోని ఓ ఈద్గా గ్రౌండ్ వద్ద సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. తాను వెళ్లి దాన్ని పగలగొట్టా. లోకల్ ఎమ్మెల్యే అయిన తనకు చెప్పకుండా శంకుస్థాపన చేశారని ఆరోపించారు. అందుకే మరో ఆప్షన్ లేక దాన్ని పగలగొట్టా. ఇదే స్థలానికి పక్కన ఉన్న కొంత స్థలంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోసం స్థలం ఇవ్వమంటే అధికారులు ఇవ్వలేకపోయారని, తాను అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేనని, తనకు ఎవరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని దానం మండిపడ్డారు.