Suryaa.co.in

Andhra Pradesh

ఎర్రంశెట్టి నర్సయ్యకు విద్యార్ధుల వీడ్కోలు

నరసరావుపేట: మున్సిపల్ హైస్యూలు ఉపాధ్యాయుడు ఎర్రంశెట్టి నర్సయ్య పదవీవిరమణ వీడ్కోలు సభ విద్యార్ధుల అభినందల మధ్య జరిగింది. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నర్సయ్య మాస్టారుకు విద్యార్ధులే కాకుండా, తమలో స్ఫూర్తినింపిన సహచర ఉపాధ్యాయులు సైతం నర్సయ్య మాస్టారు గొప్పదనాన్ని ప్రస్తుతించారు.

వందలాది మంది విద్యార్ధులు, ఉపాధ్యాయులతో జరిగిన నర్సయ్య మాస్టారి పదవీవిరరణ వీడ్కోలు సభకు.. మడకా సత్యనారాయణ, పోలపెద్ది రాధాకృష్ణమూర్తి, చేరెడ్డి మస్తాన్‌రెడ్డి, శ్రీరాంరెడ్డి, తోమసయ్య, మహమూద్, కోటేశ్వరావు, మార్తి కృష్ణమూర్తి, జమ్ముల రాధాకృష్ణ, సులేఖ, వరదయ్య, మామిడి సుబ్బారావు, ఉప్పల పాటి రంగమోహన్, ఎంఎల్‌విఆర్‌ప్రసాద్, మార్తి చంద్రశేఖర్, స్థానిక నేతలు చల్లా శ్రీనివాస్, వై.చెంచయ్య తదితరులు హాజరయి.. నర్సయ్య మాస్టారి రిటైర్మెంట్ జీవితం సాఫీగా సాగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నరసయ్య మాస్టారు.. ఉపాధ్యాయ జీవితంలోని ఆటుపోట్లను ప్రస్తావించారు. ఎన్ని పదవులున్నా ఉపాధ్యాయుడి పదవికి ఉన్న విలువ, గౌరవం మరెవరికీ సాధ్యం కాదన్నారు. ఈ సందర్భంగా ఆయన తన విద్యార్ధి జీవితం, టీచరుగా విద్యార్ధులతో తన అనుభవాన్ని పంచుకున్నారు. తన ఉపాధ్యాయ జీవితంలో తనకు సహకరించిన వారిని గుర్తుచేసుకుని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్ధులు-సహచర ఉపాధ్యాయులు, చిన్ననాటి మిత్రులు నర్సయ్యను సత్కరించారు.

LEAVE A RESPONSE