Suryaa.co.in

Andhra Pradesh

జగన్ తమ్ముడు…డబ్బుల కోసం ఎందుకు ఇంతలా దిగజారుతున్నావు?

-ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు సుంకర పద్మశ్రీ

రాష్ట్రంలో మద్య నిషేధం అని హామీ ఇస్తే మహిళలు నమ్మి నిన్ను గెలించారు.తమ్ముడిగా మాకు, మా పిల్లలకు అండగా ఉంటావు అనుకున్నాం కానీ నువ్వే మమ్ములను వేదిస్తావని అనుకోలేదు.రాష్ట్రంలో మంచినీళ్లు కంటే మధ్యమే సులువుగా దొరుకుతుంది.కొత్త బార్‌ పాలసీని ప్రకటించి రాష్ట్రంలో మద్యం తలుపులు తెరిచారు.బార్లకు లైసెన్స్‌ మూడు సంవత్సరాల పాటు అనుమతి ఇవ్వడం ఏంటి ?.ఇప్పటికే విచిత్రమైన బ్రాండ్స్ తాగి ప్రజలు వింతగా ప్రవర్తిస్తున్నారు.మద్యం మత్తులో వైసీపీ నేతలే మహిళలు, దళితులపై దాడులు చేస్తున్నారు.రాష్ట్రంలో ఇంకా సంపూర్ణ మద్యపాన నిషేధం ఎక్కడ? మద్యం ఆదాయం రూపంలో సీఎం జగన్ మహిళల కన్నీరు తాగుతున్నారు.సీఎం జగన్ కి మహిళలపై గౌరవం ఉంటే రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలి.

LEAVE A RESPONSE