Suryaa.co.in

Telangana

అన్ని వర్గాల మద్దతు

– సికింద్రాబాద్ బీ.ఆర్.ఎస్. ఎంపీ అభ్యర్ధి పద్మారావు

ఎన్నికల ప్రచారంలో తమకు అన్ని వర్గాల మద్దతు లభిస్తోందని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. బీ.ఆర్.ఎస్. విజయం ఖాయంగా మారిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం పద్మారావు గౌడ్ నాంపల్లి నియోజకవర్గంలోని ఆసిఫ్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాంపల్లి నియోజకవర్గం ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్. వెన్నంటే నిలవనుందని, ప్రజలు కాంగ్రెస్, భాజపా లకు గుణపాఠం నేర్పేందుకు సిద్దపడుతున్నారని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎం.ఎల్.సి. ఎం.ఎస్. ప్రభాకర్ రావు, బీ.ఆర్.ఎస్. నేతలు ఆనంద్ గౌడ్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మహావీర్ నగర్, యాదవ బస్తీ, మందుల గూడా తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

LEAVE A RESPONSE