– పింఛన్లు పంపిణీ చేసిన కూటమి పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం
రామచంద్రపురం: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో కూటమి ప్రభుత్వం పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుందని కూటమి పార్టీ సీనియర్ నాయకులు, మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అన్నారు. మంగళవారం ఆయన ఇంటింటికి పింఛన్ల కంపెనీ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు.
చప్పిడివారి సావరం గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వాసంశెట్టి సత్యం పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా, అర్హులందరికీ కూటమి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తుందన్నారు.
ఈ ఏప్రిల్ మాసం నుంచి దివ్యాంగ విద్యార్థులకు నేరుగా వారి ఖాతాలకే పింఛను సొమ్ము అందేలా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్( DBT) పద్ధతిలో చర్యలు తీసుకున్నారని అన్నారు. భర్త చనిపోయిన మహిళలకు కూడా వారి పింఛన్ వెంటనే అందేలా కృషి జరుగుతుందన్నారు.