రాజద్రోహం చట్టం అమలుపై సుప్రీం కోర్టు స్టే

– తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి కేసులు నమోదు చేయవద్దు
– ఇప్పటికే నమోదైన కేసుల్లో చర్యలు తీసుకోవద్దు.
-తెల్లదొరల చట్టాలను పాతరేసే ప్రక్రియ కొనసాగిస్తామన్న కేంద్రం

రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టంపై అమలుపై స్టే విధిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. రాజద్రోహం చట్టంలోని సెక్షన్ 124-ఏ అమలుపై సుప్రీం కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని సుప్రీం ఆదేశించింది సుప్రీం కోర్టు]కేంద్ర ప్రభుత్వ పునఃపరీశీలన అయ్యేవరకు సెక్షన్ 124ఏ కింద ప్రభుత్వాలు ఎలాంటి కేసులు నమోదు చేయవద్దు. ఇప్పటికే నమోదైన కేసుల్లో చర్యలు తీసుకోవద్దు. మానవ హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉంది.

రాజద్రోహ చట్టంలోని నిబంధనల(సెక్షన్ 124ఏ)ను పున:పరిశీలిస్తామని సుప్రీం కోర్టుకు ఇటీవల కేంద్రం తెలిపింది. ఇందులో మార్పులకు అవకాశముందని వెల్లడించింది. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలనకు తీసుకోవద్దని కోరింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ అఫిడవిట్‌ను సమర్పించింది.

3 పేజీలతో కూడిన అఫిడవిట్‌ను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. కాలం చెల్లిన చట్టాలను తొలగించడంతోపాటు దేశ సౌర్వభౌమత్వం, రక్షణకు కట్టుబడి ఉన్నామని అఫిడవిట్‌లో పేర్కొంది. దేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మూలనపడేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వెల్లడించింది.

Leave a Reply