Suryaa.co.in

Telangana

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఊరట

హైదరాబాద్‌: కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి టీఎస్‌ఎల్‌పీఆర్బీ, సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌కు సానుకూలంగా తీర్పు వచ్చినట్టు విశ్వస నీయ సమాచారం.దీంతో నిరుడు అక్టోబర్‌ 4న ప్రకటించిన కానిస్టేబుల్‌ ఫలితాలనే ఫైనల్‌ చేస్తూ.. నేడో, రేపో టీఎస్‌ఎల్‌పీఆర్బీ తుది ప్రకటన చేయనున్నది.

జరిగిన తప్పొప్పులపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవరిస్తూ.. నిపుణుల కమిటీ వేయా లన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ టీఎస్‌ఎల్‌పీఆర్బీ అధికా రులు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లారు.ఈ నేపథ్యంలోనే బోర్డుకు అనుకూలంగా తీర్చు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పోలీసు, జైళ్లు, ఫైర్‌, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్‌ శాఖల అధికారులకు టీఎస్‌ఎల్‌పీఆర్బీ నిరుడు అక్టోబర్‌ 4న ఇచ్చిన తుది ఫలితాలే ఫైనల్‌ అంటూ సమాచారం ఇచ్చినట్టు సమాచారం.

ఆయా విభాగాల నియామక పత్రాలు తయారు చేసుకో వాలంటూ రాష్ఱ్రహోంశాఖ రహస్యంగా ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఉన్నతాధి కారులకు ఎంపికైన అభ్యర్థుల వివరాల లిస్టు, ఇతర లేఖలు వెళ్లాయి. డ్రైవర్‌, మెకానిక్‌ పోస్టులకూ లైన్‌క్లియర్‌ అయినట్టు సమాచారం…సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా నోటిఫికేషన్‌ ఇచ్చిన దగ్గర్నుంచి..తుది ఫలితాలు విడుదల వరకు అన్నింటినీ పద్ధతి ప్రకారం నిర్వహించామని, సాంకేతి కంగా కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకొన్నామని బోర్డు తరఫు న్యాయవాది వివరించారు. దీంతో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు కూడా.. బోర్డు వాదనలకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలిసింది.

LEAVE A RESPONSE