Suryaa.co.in

Andhra Pradesh

పంచాయితీల నిధులను స్వాహా చేసిన పబ్జి స్టార్

-వాలంటీర్లను చూసుకొని పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం
-హవ్వ…ఎంపీ, ఎమ్మెల్యేలకు 41A నోటీసు ఇవ్వకుండా భయపెట్టే పరిస్థితినా?
-గత నెల హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని రాష్ట్ర పోలీసులు
-నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్ విధించే మెజిస్ట్రేట్లకు హైకోర్టు మెమో జారీ చేయాలి
-పాలకుల బూట్లు నాకే కొంతమంది పోలీసు అధికారులు, పోలీసు వ్యవస్థను బ్రష్టు పట్టించారు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన పంచాయితీ నిధులను పబ్జి స్టార్ జగన్మోహన్ రెడ్డి స్వాహా చేశారని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. పంచాయితీ వ్యవస్థను ఇంత దారుణంగా దెబ్బతీసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సభ్య సమాజానికి దూరంగా పెట్టాల్సిన బాధ్యత గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఒక్క పౌరుని పై ఉందని ఆయన అన్నారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…. వాలంటీర్లను చూసుకొని విర్రవీగుతున్న వ్యక్తిని సమర్థిస్తారా?, పంచాయతీ వ్యవస్థకు ఇలాంటి దురవస్థను తీసుకువచ్చిన దుష్ట పాలకుల్ని భూస్థాపితం చేయాలన్నారు. సర్పంచులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడే ఈ దుష్ట పాలకుల పతనానికి నాంది కాబోతోంది. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రతిజ్ఞ బూనాలను రఘురామకృష్ణం రాజు కోరారు.

నిజమైన ప్రజా ప్రతినిధులు సర్పంచ్ లేనని, ఎటువంటి పార్టీ గుర్తులు లేకుండా గతంలో తాను చేసిన సేవలకు, ఇంటింటికి తిరిగి ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకొని ప్రజలు వేసిన ఓట్లతో వారు గెలుస్తారు. పంచాయితీ వ్యవస్థ ద్వారా గ్రామీణ వ్యవస్థ బలోపేతం అవుతుంది. గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశ స్వరాజ్యాన్ని సాధించవచ్చునని జాతిపిత మహాత్మా గాంధీ చెబితే, అభినవ గాంధీ గా చెప్పుకునే పబ్జి స్టార్ జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థను ఎంతో బ్రష్టు పట్టించారు.

15వ ఆర్థిక సంఘం పంచాయతీలకు ఇచ్చిన 8, 675 కోట్ల రూపాయల నిధులను స్వాహా చేశారు. ఒక్క రూపాయ కూడా పంచాయితీలకు ఇవ్వలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సర్పంచుల సంఘం సభ్యులు రాష్ట్ర అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్నో ఆందోళనలను నిర్వహించారు. పంచాయతీలకు కేటాయించాల్సిన నిధులను సక్రమంగా కేటాయించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ 200 మంది సర్పంచులు ఢిల్లీకి వచ్చినప్పుడు వారిని, నేనే కేంద్రమంత్రికి కల్పించాను

. ఈ సందర్భంగా సర్పంచులు ఇచ్చిన వినతి పత్రం పై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. పంచాయితీలకు నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఘాటైన లేఖలను రాశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం, పంచాయితీల నిధులను విడుదల చేయలేదు. పంచాయితీలకు కేంద్రం ఇచ్చిన నిధులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం హాం ఫట్ చేసింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న చట్టాలను దుర్వినియోగం చేస్తూ, ఈ స్థాయిలో నిధులను స్వాహా చేసే పనికిమాలిన నాయకులు వస్తారని, ఈ చట్టాలను రూపొందించిన సమయంలో ఎవ్వరూ ఊహించి ఉండరు.

అందుకే చట్టాలను అతిక్రమించే రాష్ట్రాలపై చర్యలు తీసుకునే విధంగా ఎటువంటి నిబంధనలను అందులో రూపొందించలేదు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో సర్పంచులు రణభేరిని మోగించాల్సి వచ్చింది. ఇప్పటివరకు ప్రజా ఉద్యమాలను అణిచివేసిన పోలీసులు కూడా నిజమైన ప్రజా ప్రతినిధులైన సర్పంచులను అసెంబ్లీ గేటు తాకకుండా అడ్డుకోలేకపోయారు. దాదాపు 150 మంది సర్పంచులు ఈ ముట్టడిలో పాల్గొన్నారు. వీరిలో ఎక్కువమంది వైకాపా కు చెందిన సర్పంచులే ఉన్నారు. 24 గంటలు ప్రజల మధ్య ఉండే సర్పంచులు, తమ గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సొంత డబ్బులను ఖర్చు చేసి అభివృద్ధి పనులను చేశారు.

సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలను కూడా చూశాం. ఇంతలా కన్నాలు వేసే వ్యక్తి ముఖ్యమంత్రి గా వస్తారని ఎవరు భావించలేదు. గ్రామ స్వరాజ్యాన్ని కూకటి వేళ్ళతో జగన్మోహన్ రెడ్డి పెకిలించే ప్రయత్నం చేశారు. గ్రామపంచాయతీలకు మంజూరైన నిధులన్నీ ఏమయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామాలలో అడుగుపెట్టడానికి అవసరమయ్యే వ్యక్తులు స్థానిక సర్పంచులే.

అటువంటి నిజమైన ప్రజాప్రతినిధులు కన్నెర్ర చేస్తే ఎటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో పబ్జి రెడ్డికి ఇప్పుడు తెలుస్తుంది. రాష్ట్రంలోని 12900 గ్రామాలకు చెందిన సర్పంచులు నిధుల స్వాహా పై ఆగ్రహంతో ఉన్నారు. ఇందులో ఎంతోమంది మహిళా సర్పంచులు కూడా ఉన్నారు. వీరి ఆగ్రహం వల్ల క్షేత్రస్థాయిలో వైకాపా దెబ్బతినడం ఖాయం. రాష్ట్రంలో ఇతరుల ఉద్యమం వేరు… సర్పంచుల ఉద్యమం వేరు.

ప్రజాస్వామ్య వ్యవస్థకు వేరు లాంటిది సర్పంచి వ్యవస్థ. శాసనసభ్యులు, ఎంపీలు ఆ చెట్టుకు కొమ్మల వంటి వారు మాత్రమే. అటువంటి వేరునే పెకిలించాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. వేరును పెకిలిస్తే చెట్టు కూలిపోవడం సహజమే. కొమ్మలపై కూర్చుని చెట్టును నరుక్కున్నట్టుగా, తన గొయ్యిని జగన్మోహన్ రెడ్డి తానే తవ్వుకుంటున్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను ఇవ్వమని ప్రాధేయపడుతున్న సర్పంచులను, దారుణంగా కర్కశంగా పోలీసుల ఇనుప బూట్ల కింద నలిగిపోయే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి కల్పించారని రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు. ఇటువంటి పరిస్థితిని రేపు ఆయన కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

రాష్ట్ర పోలీసులను చాచి లెంపకాయ కొట్టిన హైకోర్టు

రాష్ట్ర పోలీసులను చాచి లెంపకాయ కొట్టినట్లుగా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జనవరి 12వ తేదీన నేను దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును పోలీసులు అమలు చేయడం లేదు. దీనిపై న్యాయమూర్తి స్పందించారు.

ఎంపీ, ఎమ్మెల్యేలకే ఇటువంటి పరిస్థితి ఉందంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించడం జరిగింది. న్యాయమూర్తి ప్రస్తావించిన ఆ ఎంపీ ని నేనే. ఏడేళ్ల లోపు జైలు శిక్ష కలిగిన కేసులలో 41 A నోటీసులను జారీ చేసి విచారించాలని సుప్రీం కోర్టు ఖచ్చితమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర పోలీసులు ఆ మార్గదర్శకాలను పాటించకపోవడం దురదృష్టకరం. ఇక్కడ ఒక నిబంధన అన్నది లేదు. పైనున్న పాలకులు ఎలా చెబితే అలా నడుచుకునే కొంతమంది పోలీసు అధికారులు ఉన్నారు.

పాలకుల బూట్లు నాకే ఆ పోలీసు అధికారులు, పోలీసు వ్యవస్థనే శాసిస్తున్నారు. నేను దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు ను విధిగా పోలీసులు పాటించాల్సి ఉండగా, పాటించడం లేదు. ఏలూరు సాంబశివరావు కు చెందిన గ్రానైట్ ఫ్యాక్టరీ కి పోలీసులు తనిఖీలను నిర్వహించారు. తనిఖీలలో భాగంగా తమకు సహకరించలేదన్న కారణంగా ఏలూరు సాంబశివరావు తో పాటు, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లకు లోపు జైలు శిక్ష కలిగిన సెక్షన్లు.

అయినా మెజిస్ట్రేట్ రిమాండ్ విధించడం ఆశ్చర్యకరం. మెజిస్ట్రేట్ లు హైకోర్టు ఇచ్చిన తీర్పులను కచ్చితంగా అనుసరించాలి. మెజిస్ట్రేట్లు ఇచ్చే ఇటువంటి తీర్పులను పరిశీలించినప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు బహుశా వారికి తెలిసి ఉండకపోవచ్చునేమో నన్న అనుమానం కలుగుతుంది. ఏడేళ్ల లోపు జైలు శిక్ష కలిగిన సెక్షన్లలో 41 A నోటీసులు జారీ చేసి విచారించాలని మెజిస్ట్రేట్లు చెబుతున్నప్పటికీ , వారిని కూడా కొంత మంది పోలీసు అధికారులు భయపెడుతున్నట్లు తెలిసింది.

దీనితో గత్యంతరం లేక ఏలూరు సాంబశివరావు కోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి వీలుగా తనకు ఇంట్రీమ్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు. కేసు విచారించిన న్యాయమూర్తి, గత నెల 12వ తేదీన ఇచ్చిన తీర్పునే ఇచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు కూడా 41 A నోటీసులు ఇవ్వకుండానే భయపడే పరిస్థితి తీసుకు వస్తున్నారంటే, సభ్య సమాజానికి పోలీసులు ఇస్తున్న సంకేతాలు ఏమిటని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు.

ఇటువంటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన సిఫార్సు చేశారు. పోలీసులను సిగ్గులేని సన్నాసుల్లారా అని ఒక న్యాయమూర్తి అన్నారంటే, అంతకంటే అప్రతిష్ట మరొకటి ఏముంటుంది. పోలీసులను సిగ్గులేని సన్నాసుల్లారా అని రఘురామకృష్ణంరాజు అన్నారని అవసరమైతే సాయంత్రం ఒక మీటింగ్ ను ఏర్పాటు చేసుకొని నిరసన ప్రకటనను విడుదల చేసుకోండి. గ్రానైట్ క్వారీ తనిఖీ చేసిన సమయంలో సహకరించలేదని ఏడు మందిపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్ల లోపు జైలు శిక్ష కలిగినవే అయినప్పటికీ, మెజిస్ట్రేట్ వారికి రిమాండ్ ను ఎలా విధించారు.

మేజిస్ట్రేట్ ఇష్టమేనా?, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, హైకోర్టు తీర్పులను వారు అనుసరించరా?ఈ విషయాన్ని ప్రజల తరఫున ఒక ప్రజా ప్రతినిధిగా ప్రశ్నిస్తున్నాను. నిబంధనల ప్రకారం 41 A నోటీసులు జారీ చేసి విచారించాలే కానీ జైల్లో ఎలా పెడతారు. పైన ఉన్న వారు చెప్పారని ఇష్టం వచ్చినట్లు చేస్తారా? అంటూ రఘురామ కృష్ణంరాజు నిలదీశారు. ముఖ్యమంత్రి పరువు ప్రతిష్టలను దెబ్బతీయడానికి కొంతమంది పోలీసు అధికారులు ఇటువంటి దిక్కుమాలిన పనులను చేస్తున్నారేమో ఆయన తెలుసుకోవాలని, అటువంటి పనికిమాలిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అయినా పై వారు చెప్పారని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేమని కిందిస్థాయి పోలీస్ అధికారులు కచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. పోలీసులంటే వ్యక్తిగతంగా నాకు ఎంతో గౌరవం ఉంది. పోలీసులు పడే కష్టం ఎవరు పడలేరు.

కానీ కొంతమంది పనికిమాలిన పోలీసు అధికారుల వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే మెజిస్ట్రేట్ ల పై కూడా హైకోర్టు చర్యలు తీసుకోవాలి. పోలీసు అధికారులపై చర్యలకు సిఫార్సు చేసినట్లే, మెజిస్ట్రేట్లకు కూడా మెమో జారీ చేయాలి. పరోక్షంగా నైనా బాధితులకు రక్షణ కల్పిస్తామన్న భరోసాను ఇవ్వాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

అయితే, మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే లోపే నన్ను చితకబాదినట్లే, పోలీసులు ఇతరులను కూడా చితక బాదే ప్రమాదం లేకపోలేదు . నన్ను చిత్రహింసలకు గురి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిబంధనల ప్రకారం వారిని శిక్షించి తీరుతానని అన్నారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం లో ప్రజల చేత ఎన్నుకోబడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని రాజ్యసభలో వైకాపా ప్రాంతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది.

రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాదాలు తీర్మానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించిన తీరు అద్భుతం. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు వస్తాయని, బిజెపికి 360 స్థానాలు వస్తాయని చెప్పారు. అంతేకానీ మా పనికిమాలిన నాయకుల మాదిరిగా 175 స్థానాలకు గాను 175 స్థానాలు వస్తాయన్నట్టు… 540 స్థానాలకు గాను 540 లేదంటే 530 స్థానాలు వస్తాయని చెప్పలేదని రఘు రామకృష్ణంరాజు అన్నారు.

LEAVE A RESPONSE