Suryaa.co.in

Andhra Pradesh

అంగన్వాడీలకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రాల్లో ఏపీ

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు అత్యధిక గౌరవ వేతనం అందించే అయిదు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంగన్వాడీలకు సగటున 7 వేల రూపాయల చొప్పున అత్యధిక నెలసరి వేతనం చెల్లిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక ఉన్నట్లు ఆమె గణాంకాలతో సహా వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు అందిస్తున్న గౌరవ వేతనం 2018, అక్టోబర్ 1 నుంచి పెంచినట్లు మంత్రి తెలిపారు.

తిరుపతి ఐఐటికి 1091 కోట్లు విడుదల

తిరుపతి ఐఐటి క్యాంపస్ శాశ్వత భవనం నిర్మాణానికి సంబంధించిన సివిల్ వర్క్స్, ఎక్విప్‌మెంట్‌, ఫర్నిచర్ కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1091.75 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ పేర్కొన్నారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికరింగ్, నాన్ రికరింగ్ ఖర్చుల కోసం ఇప్పటివరకు రూ.190.17 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే ఐఐటీ తిరుపతి క్యాంపస్ తొలిదశ కింద చేపట్టిన శాశ్వత భవనాల నిర్మాణం పూర్తి చేసి యాజమాన్యానికి అప్పగించినట్లు మంత్రి తెలిపారు.

LEAVE A RESPONSE