– ప్రాణహిత-చెవేళ్లను కాంగ్రెస్ పార్టీ ఏటీఎం గా వాడుకుంది
– కాల్వలకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి ఆంధ్రా కాంట్రాక్టర్ల జేబులు నింపింది
– జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
– చనాకా కొరాటా ప్రాజెక్ట్ సందర్శన
ఆదిలాబాద్ జిల్లా: చనాకా కొరటా ప్రాజెక్ట్ 90 శాతం పూర్తైంది. 10 శాతం పనులు కూడా కాంగ్రెస్ చేయటం లేదు. బీఆర్ఎస్ చేసిన ప్రాజెక్ట్ అని పక్కన పెడుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారు. ప్రాణహిత-చేవెళ్ల రీ డిజైన్ లో భాగంగానే ఆదిలాబాద్ లో పలు ప్రాజెక్ట్ లు చేపట్టాం .
బీఆర్ఎస్ హయాంలో 2 వేల కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ ఈ బడ్జెట్ లో పెట్టిన రూ. 179 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్ట్ పూర్తవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం లో జరిగిన మంచిని మంచి.. చెడును చెడు అంట. పత్తి రైతుల సమస్య, చనాకా కొరటా అంశాలపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు?
కాంగ్రెస్, బీజేపీ ల మధ్య పక్కా మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోంది. మనం ఇప్పుడు కొరాటా గ్రామంలో మనం ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలోని రైతులకు 50 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ఈ ప్రాజెక్ట్ కడతామని నాలుగు దశాబ్దాలు కాలయాపన చేశారు. కాంగ్రెస్, టీడీపీ లు ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పి ఓట్లు దండుకున్నాయి.
కానీ బీఆర్ఎస్ వచ్చాక చనఖా, కొరాటా ప్రాజెక్ట్ ను 90 శాతం పూర్తి చేసుకున్నాం. ఈ ప్రాజెక్ట్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. కాంగ్రెస్ రైతుల విషయంలో చిత్తశుద్ధితో ఉండి ఉంటే కనీసం ఏటా 10 వేల ఎకరాలకైనా నీళ్లు వచ్చేవి.
ప్రాజెక్ట్ కు సంబంధించి గతేడాది 72 కోట్లు, ఈ ఏడాది రూ. 179 కోట్లు బడ్జెట్ లో పెట్టారు. కానీ ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. బడ్జెట్ లో పెట్టి రైతులను మభ్య పెట్టటం దేనికని అడుగుతున్నా? 90 శాతం పూర్తైన ప్రాజెక్ట్ ను మరో పది శాతం పూర్తి చేయలేరా? ప్రాజెక్ట్ కోసం తీసిన కాల్వల్లో ఓవర్ ఫ్లో అయి పంటలు పాడవుతున్న పరిస్థితి ఉంది. కొరటా గ్రామంలో నిర్వాసితులు 213 మంది ఉన్నారు. వాళ్లకు పరిహారం ఇవ్వాల్సి ఉంది.
కాంగ్రెస్ ప్రయత్నం వచ్చాక కనీసం వాళ్లకు పరిహారం ఇచ్చే పని కూడా చేయలే. మహారాష్ట్ర వైపు ఉన్న చనాఖా గ్రామంలో 1500 ఎకరాల భూ సేకరణ మిగిలి ఉంది. ఇక్కడ ఉన్నది బీజేపీ ఎమ్మెల్యే, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఆయన ఎందుకు అక్కడి ప్రభుత్వాన్ని ఒప్పించి భూ సేకరణ చేయించటం లేదు?మహారాష్ట్ర వైపు రిటైనింగ్ వాల్ కట్టారు. మన వైపు కూడా కట్టాలని రైతులు కోరుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యానికి నిరనసగా ఇక్కడే మేము వంటలు చేసుకున్నాం. ప్రాణహిత- చెవేళ్ల రీ డిజైన్ చేసుకున్నందుకే ఆదిలాబాద్ కు నీళ్ల కోసం చనఖా-కొరటా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. ఇందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వమే రూ. 2 వేల కోట్లు మంజూరు చేసింది. బీఆర్ఎస్ లో ప్రభుత్వంలో జరిగిన మంచిని మంచి…చెడును చెడు అని చెబుతా. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏనుగు ఎల్లింది. తోక చిక్కింది. వీళ్లు బడ్జెట్ లో పెట్టిన రూ. 179 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్ట్ పూర్తవుతుంది.
అది కూడా చేయకుండా కాంగ్రెస్ మహాపాపానికి ఒడిగట్టింది. దీనిపై బీజేపీ వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదు? ఈ జిల్లాలో పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ పక్ష నేత కూడా. రాష్ట్రంలో అన్ని అంశాలపై మాట్లాడాల్సిన ఆయన ఎందుకు ఈ ప్రాజెక్ట్ కోసం మాట్లాడటం లేదు.
పత్తి రైతుల సమస్యలపై, చనాకా కొరటా ప్రాజెక్ట్ పై ఆయన మౌనం దేనికి? అసలు ఈ ప్రాజెక్ట్ వద్దకు పాయల్ శంకర్ గారు ఎందుకు రాలేదు? గతంలో ప్రాణహిత-చెవేళ్లను కాంగ్రెస్ పార్టీ ఏటీఎం గా వాడుకుంది. కాల్వలకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి ఆంధ్రా కాంట్రాక్టర్ల జేబులు నింపింది.