– రోడ్డు విస్తరణ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అలసత్వం లేదు
– చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనాస్థలి వద్ద మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు
చేవెళ్ల: ప్రతి దానికి రాజకీయాలు చేయడం ప్రతిపక్షాలకు బాగా అలవాటు అయ్యింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే దాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదు. దాన్ని మీ విచక్షణకే వదిలేస్తున్నాం. రోడ్డు విస్తరణ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అలసత్వం లేదు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదు.
ఈ రోడ్డు విస్తరణ పనులను కొందరూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసి ఇన్నిరోజులు అడ్డుకున్నారు. ఆ విషయం తెలిసి కూడా ఇప్పుడు మాపై కావాలనే బురద జల్లుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలను ట్రిబ్యునల్ ముందు సమర్థవంతంగా వినిపించడంతో తాజాగా ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వచ్చింది. దీంతో ఈ రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టాం. 18 నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం.