వేలును సుత్తితో బాదేసి..
నిలువెల్లా కోరికేసి..
బ్రహ్మానందాన్ని భూమిలో
పాతేసి…బుర్ర తినేసి..
తెలుగు ప్రేక్షకుల్ని
హాస్యపు జల్లులో
ఉతికి ఆరేసి..
నవ్వులతో నాలుగుస్తంభాలాట
ఆడిన వీరభద్రుడు..
వేలుతో కలిసి
ఇప్పుడు బ్రతికొచ్చినా
వేలుకు మళ్లీ చచ్చేంత చావే
బ్రహ్మానికి చాకిరేవే..!
నాన్నా..ఇప్పుడే వచ్చారా..
అని నరేష్ అడిగిన పాపానికి
లేదురా..నిన్ననే వచ్చి మెట్ల కింద దాక్కున్నాను..
అని చెప్పాలా..
అంత చిరాకా..
ఔను మరి..
వీరభద్రుడా మజాకా!?
అయినా..
చెప్పింది నచ్చకపోతే..
తనకి నప్పకపోతే..
బుర్ర చేత్తో
కొట్టుకునే బదులు..
గోడకేసి కొట్టుకోడమా
అక్కడ గడియారం
అసలే వదులు..
కింద పడి ముక్కలై..
కడుపు చెక్కలై ఊరుకుంది..!
అన్నట్టు..బ్రహ్మాన్ని
అలా పాతిపెట్టి
హైదరాబాదు..సికింద్రాబాదు
వికారాబాదు..హుస్నాబాదు
అంటూ ఊరూరూ తిప్పేసి బాదేస్తాడా…!
కొడుక్కి ఉత్తరం రాస్తూ కూడా తిట్ల వర్షమే
అదేమని అడిగిన పెళ్ళానికి
నా కవరు..నా కొడుకు..
జాబు రాస్తూ ఇదీ జవాబు!
కోడలేదంటే గోడలకేసి
చూస్తావేంట్రా
ఊడల జుత్తు వెధవా..
వీరభద్రం..వేలు
ఉంటే అదే పదివేలు…
జంధ్యాల సుత్తి..
నవ్వుల స్తుతి..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286