Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ప్రభుత్వాన్ని దింపి తీరుతాం : పరిపూర్ణానంద

కర్నూలు : సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయని పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని యత్నించారన్నారు. కేరళ కూర్గ్‌లో కొండ జాతి గిరిజనులను టిప్పు సుల్తాన్ ఉచకోత కోశారని పరిపూర్ణానంద తెలిపారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని పెట్టాలనుకున్న జగన్ ఆలోచన ఎలాంటిదో అర్థమవుతుందన్నారు. పీఎఫ్ఐ ప్రోత్సహంతో హిందువులు 98 శాతం ఉన్న ప్రాంతంలో మసీదు నిర్మించే ప్రయత్నం చేశారన్నారు. తుగ్లక్ సుల్తాన్, తుగ్లక్ బాద్‌షాలు తయారవుతున్నారని… ప్రభుత్వాన్ని దింపి తీరుతామన్నారు. జగన్‌కు జైళ్లలో వేయడం ఆనవాయితీగా మారిందన్నారు. జైల్ భరో చేసి జైళ్లను నింపుదామన్నారు. హిందువులు అందరినీ కేసులు పెట్టి లోపల వేసినా సిద్ధంగా ఉండాలని పరిపూర్ణానంద పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE