మైనార్టీల్లో అతి కొద్దిమంది తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు

Spread the love

రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్

కర్నూలు : వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగాయని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. ఆలయాలపై దాడులను వ్యతిరేకిస్తే బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారన్నారు. 80 శాతం హిందువులున్నా 20 శాతం ఉన్న మైనార్టీలకు రాజ్యాంగంలో రక్షణ కల్పించిందన్నారు. మైనార్టీలకు ఇక్కడ ఉన్న రక్షణ ఎక్కడా లేదని, అయితే మైనార్టీల్లో అతి కొద్దిమంది తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని, మైనార్టీలు ఇది గుర్తించాలని టీజీ వెంకటేష్ కోరారు.

హిందువులకు న్యాయం జరిగినపుడు ప్రశ్నిస్తే మతోన్మాదం ముద్ర వేస్తారన్నారు. ఆత్మకూరులో తీవ్రవాద భావాలున్న వారు కొందరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారన్నారు. హిందువులు, మైనార్టీలు అన్నదమ్ముల్లా బతకాలని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. మైనార్టీలు సోదరులు అందరూ తప్పు చేయడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం నిలదొక్కుకొని ఉందంటే బీజేపీ ఆశీర్వాదం వల్లే అని గుర్తించాలన్నారు. మూడేళ్లు ముగిసిందని, బీజేపీ ప్రతి కార్యకర్త పోరాడాలని టీజీ వెంకటేష్ పిలుపునిచ్చారు.

Leave a Reply