Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, అక్టోబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సూచించారు. శనివారం గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని ముదినేపల్లి జడ్పీటీసీ సభ్యురాలు ఈడే వెంకటేశ్వరమ్మ, ఆమె భర్త ఈడే వెంకటేశ్వరరావులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరమ్మకు మంత్రి కొడాలి నాని పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.
అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహనరెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా అన్నివర్గాల ప్రజల సమస్యలను దగ్గరగా చూశారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని . తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నవరత్నాలను ప్రవేశపెట్టి పేదప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. ఈ పథకాలన్నీ అర్హులైన పేదలకు అందేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మంత్రి కొడాలి నాని చెప్పారు.

LEAVE A RESPONSE