Suryaa.co.in

International Telangana

లండన్‌లో గాంధీ విగ్రహం వద్ద తలసాని ధర్నా

అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ అనేక మంది కి స్ఫూర్తిగా నిలిచారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన సంఘటన తో లండన్ లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

మహాత్మాగాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని, కేంద్రంలోని BJP ప్రభుత్వం హింసా వాదాన్ని ప్రోత్సహింస్తుందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు, విధానాలతోtsy-london2 దేశం పరువు ప్రతిష్టలు దిగజారుతున్నాయని విమర్శించారు. వ్యవసాయ రంగంలో నల్లచట్టాలను తీసుకొచ్చి. నరేంద్ర మోదీ నాయకత్వంలో ని కేంద్ర ప్రభుత్వం అనేకమంది రైతుల ప్రాణాలను బలిగొన్నదని చెప్పారు.

మహ్మద్ ప్రవక్త పై అనాలోచిత విమర్శలు చేసి ప్రపంచం ముందు దేశం పరువు, విలువలను దిగజార్చారని ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన చాలా బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన లో మృతి చెందిన రాకేష్ కుటుంబ సభ్యులకు మంత్రి తన తీవ్ర సంతాపం తెలిపారు. మోదీకి మంచి బుద్ధి ప్రసాదించాలని గాంధీ విగ్రహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వినతిపత్రాన్ని అందజేసి వేడుకున్నారు.

LEAVE A RESPONSE