శబరి వృత్తాంతం

Spread the love

జగదభిరామునికే
ఎంగిలి పడిన పండును
తినమని సమర్పించుకున్న
అపూర్వ ప్రీతిభక్తురాలు శబరి…!!

బోయకన్యయైనా.. మునికన్యలా
మాతంగముని శిష్యరికంలో
యోగినిగా అవతరించిన
యోగ్యురాలు శబరి…!!

రామదర్శనంలోనే
ధన్యత కలదన్న కాంక్షను అణువణువునా నింపుకున్న
ధన్యురాలు శబరి…!!

ముదుసలియైనా
రామనామమే సర్వస్వమై
తన జీవితాంతం
జానకి రాముడి
దర్శనభాగ్యం కోసం
ఎదురుచూసిన
దీక్షాపరురాలు శబరి!!

“రామ రామ”అని
ఆత్మీయంగా పిలిచి
ఆ సీతాపతినే ముగ్దుడిని చేసి..
శ్రీరాముడి అనుమతితో
శరీరాన్ని యోగాగ్నిలో
అర్పించుకొని
మోక్షాన్ని పొందిన
పునీతురాలు శబరి!!

యోగసాధన, జ్ఞానం, మోక్షం పొందడానికీ
అందరు అర్హులే అని
నిరూపించే ఘట్టం
రామాయణంలో
ఈ భక్తాగ్రేసరి”శబరి వృత్తాంతం”..!!

– నలిగల రాధికా రత్న

Leave a Reply