– మహంకాళి జాతరకు మంత్రి తలసాని ఆహ్వానం
ఈనెల 17 వ తేదీన నిర్వహించే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ EO మనోహర్ రెడ్డి, ట్రస్టీ కామేష్, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.