-అధికారులు నిద్రమత్తులో ఉన్నారా?
-మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
నందిగామ పట్టణం గురువారం నాడు ఉదయం మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య వివిధ కార్యక్రమాల నిమిత్తం బయలుదేరి వెళుతుండగా నందిగామ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా రోడ్డు ప్రమాదానికి గురైన భార్యాభర్తలను చూసి, వెంటనే ఆగి భార్యాభర్తలిద్దరిని కలసి పరామర్శించి జగన్ రెడ్డి పాలనపై, అధికారుల తీరుపై మండిపడ్డారు.
సౌమ్య ఇంకా ఏమన్నారంటే.. ప్రజా సమస్యలను అధికారులకు ఎన్నిసార్లు చెబుతున్న పెడచెవిన పెట్టి నిమ్మకు నీరు ఎత్తినట్లు ఉంటున్నారు. నందిగామ మున్సిపల్ కార్యాలయం ముందు నందిగామ – చందర్లపాడు రోడ్డు గుంటలు పడి నాశనమై పైపులైను పగిలి నీరు వృధాగా పోతున్నప్పుడు మేము దానిపై గొడవ చేస్తే తూతూ మంత్రంగా చిన్న చిన్న మరమ్మతులు చేశారు.
ఈ రోజు అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం వలన భార్య,భర్త ఇద్దరు రోడ్డు ప్రమాదానికి గురై నేలపాటు పడి గాయాలపాలయ్యారు. రాత్రిపూట వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వర్షాకాలం వర్షాభావంతో రోడ్డు పై గుంటలలో నీరు నిలబడి వాహనదారులు రోడ్డు ప్రమాదానికి గురవుతున్నారు. తక్షణమే అధికారులు రోడ్డు పైకి వచ్చి ప్రజల పడుతున్న ఇబ్బందులను గమనించి వెంటనే ప్రజా సమస్యలను పరిష్కరించాలి.