Suryaa.co.in

Andhra Pradesh

మాపై బురద, పేడ నీళ్లతో దాడి చేసి నిన్నటికి సరిగ్గా సంవత్సరం

– జూజ్జురు గడ్డపై రోడ్ల దుస్థితి
– మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య

జుజ్జూరు గ్రామం నందు సోమవారం నాడు చెరువులను తలపిస్తున్న రోడ్ల పరిస్థితి, అడుగడుగుకు గుంటలే అంటూ మండిపడుతూ తెదేపా నేతలతో కలిసి రోడ్ల దుస్థితిని పరిశీలించిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ..తెలుగుదేశం పార్టీ బ్యానర్లు చింపడం, ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టటడం వీటిపై ఉన్న మీ పౌరుషాలు అభివృద్ధి చేయడంలో మాత్రం లేదు.మా పై ఆనాడు వైసీపీ రౌడీ మూకలతో బురద,పేడ చల్లించారు.

మీరు మాపై పేడ చల్లడంలో చూపించిన పౌరుషం, బ్యానర్లను చింపడంలో చూపించిన పౌరుషం, గుంటలు పూడ్చడంలో ఎందుకు చూపించడం లేదు? ఇదేనా మీ పనితనం? కంచికచర్ల టూ మధిరSOUMYA రహదారికి పదుల సంఖ్య పైనే శంకుస్థాపనలు చేశారు ఉపయోగం ఏముంది?మాపై దాడి చేసి నిన్నటికి సరిగ్గా సంవత్సరం రోడ్డు వేయడం కాదు కదా. గుప్పెడు మట్టి కూడా వేయలేదు సిగ్గుండాలి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉంది.

ఆనాడు జగన్ రెడ్డి నేను ఉన్నాను నేను విన్నాను అన్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని పబ్జి ఆడుకుంటున్నాడు. అభివృద్ధి చేయడం చేతకాదు కానీ, ప్రకృతి సంపదను గుట్టలు, కొండలు, గట్లు అన్నింటినీ కొట్టేస్తున్నారు.ఇసుకను ఇష్టానుసారంగా రాత్రికి రాత్రి రాష్ట్రాలుSOUMY2 దాటిస్తున్నారు వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారు. కొండాపేట గ్రామములో గత పది రోజులుగా వందల లారీల ఇసుక తరలి వెళ్లిపోతుంటే అటు వైపుగా ఒక్క అధికారి కూడా చూసిన పాపాన పోలేదు.

అధికారుల సైతం చలనం లేకుండా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేయడం నిజంగా సిగ్గుమాలిన చర్య. ఈ మధ్య సోషల్ మీడియాలో జుజ్జూరు రోడ్ల మీద జోకులు వేస్తున్నారు. ప్రపంచ డ్రైవర్ల కాంపిటీషన్లో ఇద్దరి గెలిస్తే ఆ ఇద్దరు డ్రైవర్లు జుజ్జూరు రోడ్ల మీద నిత్యం తిరిగే వారంట ఈ విధంగా మన రోడ్ల మీద జోకులు వేసుకుంటున్నారు సిగ్గుండాలి.

రాష్ట్రం అంతటా ప్రజలు తెలుసుకోవాలి జగన్ రెడ్డి వచ్చాకా నదిలో ఇసుక పోయే.కంచంలో కూడు పోయే.. బడిలో తెలుగు పోయే… ఇంటిలో వెలుగు పోయే..రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజానీకానికం త్వరలోనే తగిన బుద్ది చెప్తారని ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

LEAVE A RESPONSE