మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ
• తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకు రాజకీయల్లో స్థానాలు లభించాయి.
• తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా కూడా బీసీలనే ఇవ్వడం గర్వించదగ్గ విషయం.
• వైసీపీ పాలనలో బీసీలను లొంగదీసుకోవాలని ప్రయత్నించారు.
• బీసీలకు నిజమైన రాజ్యాధికారం ఇచ్చింది టీడీపీ.
• బీసీలకు నిధులు కేటాయించి ఉన్నత విద్యను అభ్యసించేందుకు సహకారం అందించారు.
మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ..
• బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీనే.
• ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం తర్వాతనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా అధిక అవకాశాలొచ్చాయి.
• బీసీలకు స్థానిక సంస్థల్లో టీడీపీ 34% రిజర్వేషన్లు కల్పిస్తే.. జగన్ రెడ్డి 10శాతం కోత కోసి 16,800 రాజ్యాంగబద్ద పదవులు దూరం చేశాడు.
• చంద్రబాబు పాలనలో టీటీడీ, ఏపీఐఐసీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వంటి రాష్ట్ర స్థాయి సంస్థలకు ఛైర్మన్లుగా బీసీలను నియమిస్తే.. ప్రస్తుతం ఆ పదవుల్లో సొంత వారిని నియమించుకున్నారు.
• సామాజికంగా బడుగు, బలహీన వర్గాలు ఎదిగినపుడే అసలైన స్వాతంత్ర్యమని చంద్రబాబు నమ్మారు.
• అన్న క్యాంటీన్లు పెట్టి పేద, బడుగు, బలహీన వర్గాల ఆకలి తీరిస్తే.. జగన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు.
• చంద్రబాబు పెళ్లి కానుకలు, పండుగ కానుకలు అందిస్తే జగన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ..
• టీడీపీ ఆవిర్బావం తర్వాతే బీసీలకు రాజకీయ భవిష్యత్ వచ్చింది
• టీడీపీ ఏర్పడకముందు బీసీలు కులవృత్తినే నమ్ముకుని జీవించారు
• బీసీలకు రాజకీయాల్లో అక్షరాలు నేర్పిన పార్టీనే
• టీడీపీ స్ధాపన నుంచి నేటి వరకు బీసీలు టీడీపీ అండగా నిలబడ్డారు
• వైసీపీ మంత్రులు బీసీ డిక్లరేషన్ సభపై అవాకులు చెవాకులు పేలుతున్నారు
• 56 కార్పోరేషన్లకు ఒక్క రూపాయి ఇచ్చారా? సమాధానం చెప్పగలరా?
• టీడీపీ జనసేన బలహీన వర్గాలకు అండగా ఉంటుంది
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మాట్లాడుతూ..
• టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే బీసీలు అభివృద్ధి చెందారు.
• టీడీపీకి బీసీలు వెన్నుముక. బీసీల వెన్ను విరుస్తున్న వైసీపీ.
• బీసీల సమస్యల గురిచిం పోరాటం చేసే ఒక్క నాయకుడైనా వైసీపీలో ఉన్నాడా?
• నందం సుబ్బయ్య నుంచి డా. సుధాకర్ వరకు వైసీపీ నాయకులు ఊచకోత కోశారు.
• వైసీపీలో పదవులు బీసీలు అధికారం ఓసీలది.
• రెడ్డి అనే తోక తగిలించుకొని 6 రెడ్లు అధికారం చెలాయిస్తారు.
• మత్స్యకార మంత్రి ఒక్క మత్స్య కారుడికి నష్టపరిహాం ఇవ్వలేదు.
• బీసీలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వం అధికారంలోకి రావాలి.
• ప్రతి ఒక్క బీసీ 100 మందితో టీడీపీకి ఓటు వేసేలా తీర్చిదిద్దాలి.
పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ..
• బీసీ అనే పదానికి గుర్తింపు వచ్చింది తెలుగుదేశం పార్టీలేనే
• ప్రతి బీసీని నాయకుడిగా తీర్చిదిద్దిన వ్యక్తి చంద్రబాబు నాయుడు
• ఉమ్మడి 13 జిల్లాల్లో ఎక్కడ బీసీలున్నారని గుర్తించి సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా బలోపేతం చేసిన వ్యక్తి చంద్రబాబు.
• బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి చంద్రబాబు
ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధా మాట్లాడుతూ..
• బీసీల్లో ఏ కులస్థుడిని ఎడిగినా గుర్తొచ్చే ఏకైక నాయకుడు చంద్రబాబు.
• చేనేతలకు ప్రతి ఏటా రూ.250 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింది చంద్రన్న.
• రూ.110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేసింది చంద్రన్న.
• 90,765 కార్మికులకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించింది చంద్రన్న
• కార్పొరేషన్ ద్వారా రూ.2 లక్షల వరకు రుణాలు అందించింది చంద్రన్న.
• నూలు రంగులపై 20 శాతం నుంచి 40 శాతం సబ్సడీని పెంచింది చంద్రన్న
• చేనేత సహాయ నిధి, పొదుపు నిధి ఏర్పాటు చేసింది చంద్రన్న
• మూలధనం కింద రూ.30 కోట్లు కేటాయించింది చంద్రన్న
• మగ్గాలకు రాయితీల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేసింది చంద్రన్న
• లక్ష మంది చేనేతలకు రూ.2000 ఇచ్చింది చంద్రన్న