మీ బిడ్డనంటున్నాడు… జర జాగ్రత్త ప్రజలారా…

– -జగన్ కంపెనీలు కళకళ
-రాష్ట్ర ఖజానా దివాలా!
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

గత అయిదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిగారి సొంత కంపెనీలన్నీ వేలకోట్ల లాభాలతో కళకళలాడుతుంటే… అడ్డగోలు అప్పులతో రాష్ట్ర ఖజానాను మాత్రం దివాలా తీయించారు. ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాని ముఖ్యమంత్రి… అప్పులు తేవడంలో మాత్రం పిహెచ్ డి చేశారు.

రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్… తాజాగా రాష్ట్రంలో ఖనిజసంపదను తాకట్టుపెట్టి రూ.7వేల కోట్లు అప్పు తెచ్చారు. ఇప్పటికే మందుబాబులను తాకట్టుపెట్టి 33వేలకోట్లు అప్పు తెచ్చిన జగన్ జమానాలో ఇక మిగిలింది 5 కోట్లమంది జనం మాత్రమే. ఇప్పటికే నేను మీ బిడ్డనంటూ వేదికలపై ఊదర గొడుతున్న జగన్మోహన్ రెడ్డి మాటల వెనుక అంతర్యాన్ని గుర్తించి రాబోయే 2నెలలపాటు ఆయనతో జాగ్రత్తగా ఉండాల్సిందిగా రాష్ట్రప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను!!

Leave a Reply