ఈ పోలీసులకు సిగ్గుందా?

-పూలల్లో బాంబులు కూడా వస్తాయా.?
-జగన్ నువ్వు మనిషివి అయితే మారు
-ఈ ఎన్నికల్లో తెలుగు దేశం ఓడిపోతే…ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఎవరికీ ఉండదు
-మళ్లీ ముఖ్యమంత్రిగానే సభకు వెళతాను అన్నాను. అలాగే వెళతా
-తప్పు జరుగుతున్నప్పుడు నేతలు తొడకొట్టి బదులివ్వాలి
-ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ సిద్దం
-సీఎం కటౌట్ కు ఉన్న ప్రాధాన్యం ప్రజల ప్రాణాలుకు ఇవ్వడం లేదు ఇదేం ఖర్మ
-తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
– రాష్ట్ర ప్రభుత్వ రివర్స్ పాలనపై టీడీపీ చేపట్టనున్న ఇదేం ఖర్మ! అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం జాతీయ భావాలతో పని చేసిన పార్టీ. దేశంలో అనేక సంస్కరణల్లో టీడీపీ భాగస్వామిగా ఉంది. దిక్సూచిగా పనిచేసింది టీడీపీ.అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉన్నామో….ప్రతి పక్షంలోనూ అంతే బాధ్యతగా ఉండి సేవ చేసే పార్టీ తెలుగుదేశం. 1978లో నేను మొదటి సారి ఎమ్మెల్యేను అయ్యాను. అనేక మంది ముఖ్యమంత్రులను చూశాను. మన పాలన చూసేందుకు ప్రపంచ స్థాయి ప్రముఖులు కూడా మన రాష్ట్రానికి వచ్చారు. సంక్షేమం, అభివృద్దికి టీడీపీ ఒక నమూనా. చాలా మంది మఖ్యమంత్రులను చూశా…చాలా మందితో పోరాడాను.1984లోనే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పోరాడి గెలిచాం. కానీ ఇంత దారుణమైన, నీచమైన ప్రభుత్వం నేను ఎక్కడా చూడలేదు.

మూడున్నరేళ్ల క్రితం అచ్చెన్నాయుడుతో మొదలు సోషల్ మీడియా కార్యకర్తల వరకు అందరినీ వేధించారు.కోర్టులకు వెళ్లి అనేక కేసులపై పోరాడాం. కానీ అక్రమ అరెస్టులు చేసి, పోలీసు టార్చర్ చేసి కార్యకర్తలను, నేతలను వేధించారు. నా జీవితంలో పోలీసులు, ప్రభుత్వం ఇలా వ్యవహరించడం చూడలేదుఎంపీ రఘురామరాజును ప్రభుత్వం వేధించే విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.అంత ఘటన జరిగిన తరువాత కూడా ప్రభుత్వంలో మార్పు రాలేదు.

చివరికి మన పార్టీ కార్యాలయంలోపని చేసే మీడియా కో ఆర్డినేటర్ ను కూడా అరెస్టు చేశారు.ఇలా తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై చర్యలు తీసుకునేది ఖాయం.సిఎంకు చెందిన ఒక ఫ్లెక్సీ చినిగితే హంగామా చేసిన పోలీసులు…తునిలో భక్తుడి వేషంలో మా నేతపై హత్యాయత్నం చేస్తే పోలీసులు ఎక్కడికి వెళ్లారు.? సిగ్గుందా ఈ పోలీసులకు అని నేను అడుగుతున్నాను. బాధ, ఆవేదన, కసి నాకూ ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్యం పద్దతిలో నేను ఆలోచిస్తున్నాను.

స్థానిక ఎన్నికల్లో అక్రమాలతో గెలిచారు. ఇది చూసి కొవ్వెక్కి వ్యవహరించారు.బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాము. దీంతో మంచి స్పందన వస్తోంది.ఎన్నడూ లేని విధంగా మన మహానాడును కూడా అడ్డుకున్నారు. కానీ ప్రజలు కసితో, ఆవేశంతో వచ్చి మహానాడును విజయవంతం చేశారు. నందిగామలో నా కార్యక్రమానికి గతంలో ఎన్నడూ చూడనంతమంది జనం వచ్చారు. అంత జనం వస్తే నా మీద రాయి విసిరి భయపెట్టాలి అని ప్రయత్నించారు.పూలల్లో రాళ్లు వచ్చాయని పోలీసులు చెప్పారు. అంటే పూలల్లో బాంబులు కూడా వస్తాయా.?

రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లా వెళ్లాను. నా జీవితంలో ఎప్పుడూ చూడనంత జనం తరలి వచ్చారు. ఆదోని మీటింగ్ షెడ్యూల్ లో లేదు. ఒక రోజు ముందు అనుకుని మీటింగ్ పెడితే కూడా జనం తరలి వచ్చారు.ఆదోనిలో కూడా రాయివేశారు. కానీ వెనక్కి తగ్గలేదు.కర్నూలు జిల్లాలో మీటింగ్ లు చేసిన తరవాత మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ దాడులు, వేధింపులతో ప్రజలు విసిగిపోయారు. ఇక టీడీపీ రావాలి అని కట్టలు తెంచుకుని వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు.రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్ని వర్గాలు మన మీటింగ్ లకు వచ్చారు. చిన్న పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు తరలివచ్చారు. ప్రభుత్వం చెపుతున్న అధికార వికేంద్రీకరణపై కర్నూలులోనే అడిగాను.కర్నూలు ప్రజలు ముక్తకంఠంతో ఒకే రాజధాని కావాలి అని నినదించారు. జగన్ నువ్వు మనిషివి అయితే మారు అక్కడే నిలదీశాను.

నేను వెళితే కర్నూలులో నిరసనలు చెప్పడానికి వచ్చారు. అంటే జగన్ మాట మార్చితే మనం మార్చాలా.?వైసిపి అసత్యాలను పదే పదే చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఊర్లో రౌడీకి భయపడి జనం నోరెత్తరు…ఇప్పుడు అదే విధానంలో జగన్ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ప్రాణాలు అయినా ఇస్తాను గానీ….రాష్ట్రాన్ని నాశనం కానివ్వను.అమరావతి రాజధాని అని అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఇదే సిఎం, ఇదే పార్టీ ఒప్పుకున్నారా లేదా.?ఆరోజు కర్నూలులో హైకోర్టు కావాలి అని జగన్ అడగలేదు. మా నేత ఇక్కడే ఇల్లు. కట్టుకున్నారు….అమరావతే రాజధాని అని వైసిపి నేతలు ఎన్నికల చెప్పలేదా.? కర్నూలును మెగా సిటీ చేస్తాం అన్నాం…విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం అని స్పష్టంగా చెప్పాం రాయలసీమ ద్రోహి, ఉత్తరాంధ్ర ద్రోహి,…..ఆంధ్ర ప్రదేశ్ ద్రోహి జగన్.మనం చేసిన పనులను గట్టిగా ప్రజలకు చెప్పగలగాలి. ప్రజలు పోరాటానికి సిద్దంగా ఉన్నారు…..నేతలు సిద్దం కావాల్సిన సమయం ఇది. కేసుల నుంచి జగన్ తప్పించుకోలేడు అని సుప్రీం కోర్టు చెప్పింది. తప్పు చేసిన జగన్ ఎప్పటికైనా శిక్ష నుంచి తప్పించుకోలేడు.

బాదుడే బాదుడుతో ప్రజలను చైతన్య పరిచాం.సిఎం ఎలా రాష్ట్ర స్థాయిలో దోచుకుంటున్నాడో… ఎమ్మెల్యేలు కూడా స్థానికంగా దోచుకుంటున్నారు. ప్రజల భూములు, క్వారీలు, వ్యాపారులను దోచుకుంటున్నారు. ఏంటి ఈ అన్యాయం.?ముఖ్యమంత్రి నాపైనా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో తెలుగు దేశం ఓడిపోతే…ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఎవరికీ ఉండదు.

మళ్లీ ముఖ్యమంత్రిగానే సభకు వెళతాను అన్నాను. అలాగే వెళతా.ముఖ్యమంత్రి కావడం నాకు కొత్తేమీ కాదు….ప్రపంచ స్థాయలో గౌరవం పొందిన పార్టీ టిడిపి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలవకపోతే…నేతలు సిద్దంగా లేకపోతే….ఆపై రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. తప్పు జరుగుతున్నప్పుడు నేతలు తొడకొట్టి బదులివ్వాలి…అప్పుడే అరాచకాలను నిలువరించవచ్చు. జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేయడం ద్వారా అడ్డులేకుండా చూసుకుంటున్నాడు.

రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూత వేశారు.సీమలో హార్టికల్చర్, కోస్తాను ఆక్వా కల్చర్ వైపు తీసుకు వెళ్లాలి అని కార్యక్రమాలు చేశాం. ఆక్వా కల్చర్ ను దేశంలో నెంబర్ వన్ గా తయారుచేశాం. కర్నూలులో పత్తి విత్తనాల కల్తీతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.టమాటా కేజీ ఒక్క రూపాయికి అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.రైతుబజార్ లు పెట్టి నాడు రైతులకు మేలు చేశాం. ప్రభుత్వం టామాటా కొని గిట్టుబాటు ధర ఇవ్వొచ్చు…కానీ అలా చెయ్యలేదు.

రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పరిస్థితులు దిగజారడంతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు.రైతు బిడ్డలకు, కూలీల బిడ్డలకు ఐటి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం టీడీపీ..వారి జీవితాలు నాశనం చేసిన పార్టీ వైసిపి.రాష్ట్రంలో ఇరిగేషన్ ను పూర్తిగా నాశనం చేశారు. పోలవరాన్ని నిలిపివేశారు.నదుల అనుసంధాన కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా నిలిపివేశారు.

ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అనుకున్నాం. ఒక్క హంద్రీ నీవాపైనే రూ.5,300కోట్లు ఖర్చుచేశాం.రూ.64 వేల కోట్లు ఇరిగేషన్ పై ఖర్చుచేశాం. 24 ప్రాజెక్టులు పూర్తి చేశాం. విద్య, ఆరోగ్య రంగాలను సైతం ఈ ముఖ్యమంత్రి నాశనం చేశారు. మన హయాంలో పుట్టే బిడ్డల నుంచి పథకాలు అమలు చేశాం. అయితే ఇప్పుడు డోలీ కట్టి గర్భిణీలను తీసుకువెళ్లే పరిస్థితికి జగన్ తీసుకువచ్చారు.

విద్యా శాఖలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. 4 లక్షల మంది విద్యార్థులు స్కూళ్లకు దూరమయ్యారు. మనం తెచ్చిన విట్, ఎస్ ఆర్ ఎం వంటి సంస్థలకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించడం లేదుమన హయాంలో తెచ్చిన ఎయిమ్స్ కు కనీసం నీళ్లు ఇవ్వలేదు.మన హాయంలో అన్నీ కేటాయింపులు పూర్తి చేసిన గిరిజన యూనివర్సిటీని ఇంకా ప్రారంభించలేదు.

మళ్లీ యువత జాబు కావాలి అంటే బాబు రావాలి అని నినాదాలు ఇస్తున్నారు. టీడీపీ హయాంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ఇవి పూర్తి అయ్యి ఉంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి.రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోతున్నాయి. వైసిపి ఎమ్మెల్యేల నుంచి సిఎం వరకు పరిశ్రమల నుంచి వాటాల కోసం ఒత్తిడి తెస్తున్నారు.

మైనారిటీ, బిసి, ఎస్సి, ఎస్టి వర్గాలను దారుణంగా దెబ్బతీశారు. తెలుగు దేశం పార్టీకి వెన్నెముకగా ఉన్నది వెనుకబడిన వర్గాలే. కనీసం రాజకీయ ప్రాముఖ్యత లేని పరిస్థితిని నుంచి ముఖ్యమైన పదవులు ఇచ్చిన పార్టీ టీడీపీ.కేంద్రంలో ఎర్రంనాయుడుకు క్యాబినెట్ పదవి ఇచ్చి గౌరవించాం. బీసీ ఫెడరేషన్ లకు ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు.ఆదరణ పథకం కోసం తెలుగు దేశం హయాంలో వచ్చిన పరికరాలు కూడా లబ్దిదారులకు ఇవ్వలేదు. ప్రజా ధనం వృధా చేశారు.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం.ఎస్సీ సబ్ ప్లాన్ తీసుకువచ్చాం. కానీ వారి నిధులు కూడా ఈ ముఖ్యమంత్రి పక్కదారి పట్టించారు. నాడు ఎస్సిలకు రెండు గ్లాసుల పద్దతి ఉండేది….జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా నివేదిక ఇచ్చి దాన్ని రూపుమాపాం. ఎస్సిల పట్ల తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకున్నాం. ఎస్సిలను గౌరవించాం.

మైనారిటీలకు చెందిన అన్ని పథకాలు నిలిపివేశారు. ఫైనాన్స్ కార్పేషన్ పెట్టిందే టీడీపీ.ఉర్థూను రెండో భాషగా పెట్టాం…ముస్లింలకు రంజాన్ తోఫా, దుల్హన్ పథకం తెచ్చాం. రాయదుర్గంలో ఒక కుటుంబ గొడవలో కానిస్టేబుల్ జోక్యం చేసుకుని వారిని భయపెట్టాడు. దీంతో ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

కర్నూలు జిల్లాలో ఒకే చోట 10 వేల టిడ్కో ఇళ్లు కట్టాం. కానీ మిగిలిపోయిన 10 శాతం పనులు ఈ ప్రభుత్వం పూర్తి చెయ్యలేదు.నెలకు రూ.4 వేలు అద్దెలు కట్టుకుని టిడ్కో లబ్దిదారులు బయట ఉంటున్నారు. ఆ ఇళ్లు ఎందుకు ఇవ్వరు..? ఇది బాధ్యత ఉన్న ప్రభుత్వమేనా? పేదవాళ్లకు ఇంటిపేరుతో కూడా ఈ ప్రభుత్వం రూ.6 వేల కోట్ల అవినీతికి పాల్పడింది.పేదల ఇళ్లకు 5 ఏళ్ల లో 30 లక్షల ఇళ్లు కడతాము అన్నారు.

అయ్యన్న పాత్రుడిపై అక్రమ కేసు పెట్టారు. ఇలా అక్రమ కేసులు పెట్టిన ఎవరినీ వదిలేది లేదు. అధికారుల దయా దాక్షిణ్యాలు నాకు అవసరం లేదు. చట్ట ప్రకారం పని చెయ్యండి. ప్రజలకు మద్దతుగా ఉండండి..అదే నేను అధికారులను అడుగుతున్నాను. నేతలు మీటింగ్ లకు, రివ్యూలకు పరిమితం కాకూడదు. నేతలు సమర్థవంతంగా లేకపోతే రాష్ట్రానికే నష్టం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ సిద్దం.

వైసీపీ దాడులు పెంచినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొందాం.జిల్లాల్లో మన నాయకులు గట్టిగా ఉన్న దగ్గర వైసిపి వాళ్లు కంట్రోల్ లోకి వచ్చారు. ఈ రోజు చాలా స్పష్టంగా గట్టిగా చెపుతున్నా. ఇగోలు పక్కన పెట్టి నాయకులు పని చెయ్యాలి. ప్రజల్లో మార్పు ఉంది…అందుకే నేతలు కూడా హుషారుగా ఉన్నారు. ప్రజా చైతన్యంలో అనుమానం లేదు. దాన్ని మరో స్టేజ్ కు తీసుకువెళ్లడంలో నాయకులు చొరవ చూపాలి.

“ఇదేంఖర్మ” రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి.సీఎం కటౌట్ కు ఉన్న ప్రాధాన్యం ప్రజల ప్రాణాలుకు ఇవ్వడం లేదు ఇదేం ఖర్మ.? ఓటుకు వైసిపి వాళ్లు రూ.10 వేలు ఇచ్చినా…అవినీతి పోలీసులు ఉన్నా మనం గట్టిగా ఎదుర్కోవాలి. దానికి ఇప్పటి నుంచే మనం సిద్దం అవ్వాలి.” ఇదేం ఖర్మ” కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుని నిర్వహించాలి.

Leave a Reply