– దేవుడి స్క్రిప్ట్ తిరగరాశాడు
– జగన్ ప్రజల నమ్మకంతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేల నమ్మకం కూడా కోల్పోయాడు
అనురాధ గెలుపు కుక్కకాటుకి చెప్పదెబ్బ
ఉగాది.. రంజాన్ పండుగలు మన తెలుగుదేశానికి ముందేవచ్చాయి
25 వేల ఓట్లకు ఒక క్లస్టర్.. 5వేలఓట్లకు ఒక యూనిట్, బూత్ కు ఒక బూత్ కమిటీ. 30 కుటుంబాలకు ఒక కుటుంబ సాధికార సారథి
– మంగళగిరిలోని సీ.కే.కన్వెన్షన్ హాల్ లో టీడీపీ జోన్ -3 సమావేశం. సమావేశంలో చంద్రబాబునాయుడి ప్రసంగం
“కార్యక్రమానికి విచ్చేసిన క్లస్టర్, బూత్ ఇన్ ఛార్జ్ లకు, నేతలకు పేరుపేరునా ధన్యవాదాలు. 95శాతం హాజరుతో జోన్-3 సమావేశం కొత్తచరిత్ర సృష్టించింది. ఏస్థాయిలో ఉన్నా స్మార్ట్ గా పనిచేసే విధానం అందరికీ తెలియాలనే ప్రయత్నంలో భాగంగా ఉదయం నుంచి పార్టీ విభాగాలవారు కొన్నిసూచనలు, సలహాలుచేశారు. తెలుగుదేశానికి బలమైన సైన్యంఉంది. ఒక్కసారి గెలవాలని మీ మనసులో పడితే, గెలుపు తెలుగుదేశం పార్టీ తప్ప, వేరేవాళ్లు తట్టుకోలేరన్నది చరిత్ర చెప్పిన నగ్నసత్యం. 40ఏళ్లుగా భుజాలు అరిగిపోయేలా తెలుగుదేశం సైన్యం పార్టీజెండాలు మోస్తోంది. కుటుంబాలు, ఆస్తులు కోల్పోయినా పార్టీకోసమే పనిచేశారు…చేస్తున్నారు. అలాంటి వారికి శిరస్సు వంచి అభివాదంచేస్తున్నాను. వ్యక్తులకంటే సమాజం..సమాజంకంటే రాష్ట్రం..దేశంచాలా ము ఖ్యం. అవినీతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసాలవల్ల రాష్ట్రం 30ఏళ్లు వెనక్కువెళ్లింది. అప్పులుచేయడం, అవినీతి, అరాచకాల్లో మాత్రమే ముందున్నారు. సంవత్సరం క్రితం బాదుడే బాదుడు కార్యక్రమం ప్రారంభించాం.
దాని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో జరిగిన మహానాడుని కార్యకర్తలు, నేతలు భారీగా విజయవంతంచేశారు. తరువాత ఇదేంఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టాం. పన్నులు, ఛార్జీలు, ధరలభారంతో ప్రజల్ని దోచుకుంటున్నారు. మున్సిపల్, ఆస్తిపన్ను. చెత్తపన్నుఅంటూ పన్నులమీద పన్నులు వేస్తున్నారు. వాటిన్నింటిపై టీడీపీనేతలు, కార్యకర్తలు ప్రజల్ని చైతన్యవంతంచేశారు. దానిఫలితమే 108 నియోజకవర్గాల్లోజరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 3 ఎమ్మెల్సీస్థానాలు గెలిచింది. మన గెలుపు వైసీపీకి, జగన్ కు షాక్ ఇచ్చింది. ఆ దెబ్బనుంచి కోలుకోకముందే నిన్న ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోదెబ్బ కొట్టాం. వైసీపీఎమ్మెల్యేలకుకూడా జగన్ పై విశ్వాసం లేదు. అందుకే టీడీపీకి ఓటేశారు.23మంది టీడీపీతరుపున గెలిస్తే, అవహేళనచేశారు. దేవుడి స్క్రిప్ట్ అని అందుకే 23మందే మిగిలారని ఎద్దేవాచేశారు. నిన్న భగవంతుడు తిరిగి గొప్ప స్క్రిప్ట్ రాశాడు. 23ఓట్లు, 23వతేదీ, 2023న భగవంతుడు స్క్రిప్ట్ తిరగరాశాడు.
ఇకపై అన్ స్టాపబుల్. గేరుమార్చి స్పీడు పెంచుతున్నాం. సైకిల్ దూసుకెళ్తుంది.. అడ్డమొచ్చిన వారిని తొక్కుకుంటూ ముందుకు వెళ్తుంది. ఆడబిడ్డలు, తెలుగుతమ్ముళ్లు అందరూ పోరాటానికి సిద్ధమే. ప్రజావేదికకూల్చివేతతో జగన్ నిజస్వరూపం ఏమిటో బయటపడింది. ప్రభుత్వసొమ్ముతో నిర్మిం చిన భవనాన్ని కూల్చేసిన జగన్, 4ఏళ్లల్లో రాష్ట్రంలో ఒకఇటుకపెట్టి ఎక్కడా ఏమీ కట్టిందిలేదు. కట్టడంచేతగాని వాడికి కూల్చివేసేహక్కు ఎవరిచ్చారు? అమరావతి 5కోట్ల ఆంధ్రులస్వప్నం. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచపటంలో నిలిపింది తెలుగుదేశంపార్టీనే. కర్ణాటకకు బెంగుళూరులా.. తమిళనాడుకి చెన్నైలా… ఆంధ్రప్రదేశ్ కు ఈనగరం ఉందనిచెప్పుకోలేని దుస్థితి కల్పించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన సైకో జగన్. తిక్కల ముఖ్యమంత్రి మాకు మూడురాజధానులు చేస్తున్నాడనిచెప్పకోవాల్సిన దుస్థితికల్పించాడు.
పోలవరం ప్రాజెక్ట్ ని నిర్మించేక్రమంలో, అదిఅయ్యేలోగా పట్టిసీమను పూర్తిచేసి 9నెలల్లో నీళ్లు కృష్ణాడెల్టాకు పారించాం. అదీ తెలుగుదేశం పార్టీపనితీరు. దానిలో అవినీతి జరిగింది అన్నా రు.. ఇన్నేళ్లు అధికారంలో ఉండి ఏంపీకారు? పోలవరం పూర్తై నదులఅనుసంధానం జరిగి ఉంటే, శ్రీకాకుళం నుంచి కర్నూలువరకు ప్రతిఎకరం సస్యశ్యామలం అయ్యేది. గోదావరి నీరు చాలా వరకు వృథాగా సముద్రంలోకి పోతోంది. ఆనీటిని సద్వినియోగంచేసుకుంటేనే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది. రాయలసీమ రతనాలసీమ అయ్యేది. ఇరిగేషన్ రంగంలో రూ.64వే లకోట్లు ఖర్చుపెట్టి, పోలవరంలో 72శాతం పనులుపూర్తిచేశాం. జగన్మోహన్ రెడ్డి రావడంతో రాష్ట్రానికి ఐదేళ్లశని పట్టింది. ఆ శని పోలవరాన్ని నదిలో కలిపేసింది. పోలవరం ప్రాజెక్ట్ ని 45.67 మీటర్ల ఎత్తులో కట్టాల్సి ఉంటే, 41.15 మీటర్లకు కుదించారు. అది ప్రాజెక్ట్ కాదు..బ్యారేజ్ అవుతుంది. బ్యారేజ్ కట్టడానికి జగన్మోహన్ రెడ్డితోపనిలేదు. కేందప్రభుత్వం విభజనచట్టంలో పోలవరాన్ని జాతీయప్రాజెక్ట్ గా పెట్టింది. దాన్నిపూర్తిచేసే బాధ్యతను నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ రాష్ట్రానికి అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమర్థవంతంగా పని చేస్తాడని నమ్మే అప్పుడు పోలవరం నిర్మాణాన్ని మనకుఅప్పగించారు. కాంగ్రెస్ నేతలు కూడా అప్పట్లో పోలవరంనిర్మాణంపై విమర్శలు చేశారు. పట్టిసీమపై కూడా ఎగతాళిచేశారు. అసాధ్యా న్నిసుసాధ్యం చేసి పట్టిసీమతో నీళ్లిచ్చాం. పోలవరం నిర్మాణాన్ని పరుగులుపెట్టించాము. టీడీపీప్రభుత్వం వచ్చిఉంటే, 2020 జూన్ నాటికి పోలవరం పూర్తయ్యేది. జగన్ అనే శని రావడంతో దాన్ని నాశనంచేశారు. పోలవరంలో అవినీతి అని, రాద్ధాంతం చేశాడు. చివరకు ఏజెన్సీలు, కాంట్రాక్టర్లను మార్చాడు. రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడాడు. కాంట్రాక్టర్ ను మార్చ వద్దని కేంద్రప్రభుత్వంచెప్పినా జగన్ వినలేదు. ప్రాజెక్ట్ లో ఏదైనా జరగరానిది జరిగితే నష్టం వస్తుందని చెప్పినా వినలేదు. ఎందుకు కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నాయని కేంద్రప్రభుత్వం ఐఐటీ హైదరాబాద్ వారితో స్టడీచేయిస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రా క్టర్ ను మార్చడంవల్లే వర్షాలు వచ్చి, వరదలకు రెండుకాఫర్ డ్యామ్ లమధ్య ఉన్న ఇసుక కొట్టు కుపోయి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని నివేదిక ఇచ్చింది. కళ్లముందు వారుచేసిన తప్పులు కనిపిస్తుంటే, వైసీపీనేతలు, ఆంబోతులుకొందరు నావల్లే పోలవరం పాడైందని దుష్ప్రచారం చేస్తున్నారు. పోలవరాన్ని ఈవిధంగా నాశనంచేస్తారని నేనెప్పుడూ ఊహించలేదు.
పోలవరం పూర్తి చేసే వరకు టీడీపీ పోరాటం ఆగదు. పోరాడి సాధిస్తాం. ఒకపక్క పోలవరం పోయింది. అమరావతి పోయింది. పరిశ్రమలు లేవు. రోడ్లపై ఎక్కడా తట్ట మట్టివేసింది లేదు. గ్రామాల్లో కూడా ఏం చేసింది లేదు. మన ప్రభుత్వంలో గ్రామాల్లో 25 వేల కిలో మీటర్ల సిమెంట్ రోడ్లు వేశాం. ప్రతి ఊరికి కనెక్టివిటీ రోడ్లు వేశాం. మనం చేసింది ఇప్పటికీ గ్రామాల్లో చెప్పుకుంటున్నారు. మరోపక్క సంక్షేమకార్యక్రమాలకు నాందిపలికింది తెలుగుదేశం పార్టీనే. సంక్షేమానికి ఆద్యుడు మననాయకుడు నందమూరి తారక రామారావు గారు. పక్కా ఇళ్లు కిలోబియ్యం రెండు రూపాయలకు, జనతావస్త్రాల పంపిణీ వంటివాటిని ఆయనే తీసుకొచ్చారు. మనం ఉన్నప్పుడు అన్న క్యాంటీన్, విదేశీ విద్య, పెళ్లికానుక, పింఛన్ పదిరెట్లుపెంచి రూ.2వేలు చేయడం లాంటివి టీడీపీనే చేసింది. బటన్ నొక్కితే సంక్షేమం అమలైనట్టు కాదు. సంక్షేమానికి మనప్రభుత్వం చేసినఖర్చుతో పోలిస్తే, వైసీపీ ప్రభుత్వం చేసింది అరకొరే. పేదల జీవితాల్లో మార్పులు వచ్చేలా తెలుగుదేశం సంక్షేమాన్ని అమలు చేసింది. జగన్ అనే కొత్త బిచ్చగాడు కొత్త స్లోగన్ తో వస్తున్నాడు. తాను పేదల ప్రతినిధి అంటా! 2004 కంటే ముందు జగన్ అతనికుటుంబం ఆస్తి ఎంత? ఆదాయంఎంత? తరువాత ఎన్నికల్లో ఎంత చూపించారు? ఈరోజు దేశంలోని ముఖ్యమంత్రులందరూ కంటే ఎక్కువ ఆస్తి జగన్ వద్దే ఉంది. అలాంటి వ్యక్తి పేదలప్రతినిధిని అంటూ ఫోజులుకొడుతున్నాడు. ఈ విషయాన్ని మనం ఇంటిం టికీ చెప్పాలి. దోపిడీదారులు వైసీపీ వాళ్లు.. దోపిడీపార్టీ వైసీపీ.
వారికి పేదల గురించి మాట్లాడే అర్హతలేదు. ప్రజల్లో ఇప్పటికే జగన్ పై వ్యతిరేకత వచ్చింది. దాని ఫలితమే మూడు గ్రాడ్యుయేట్ స్థానాల్లో టీడీపీవిజయం. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తప్ప, పట్టభద్ర ఎన్నికలు రాష్ట్రమంతా జరిగాయి. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో కూడా టీడీపీ విజయం ఏకపక్ష మే కానుంది. అధికారపార్టీపై పోరాడాలంటే మనంచాలా అప్రమత్తంగా ఉండాలి. ఒకనేరస్తుడు.. బాబాయ్ ని గొడ్డలితో చంపేసి, గుండెపోటుగా చిత్రీకరించి, ఇప్పటికీ కుప్పిగం తులు వేస్తున్నాడు. కోడికత్తిడ్రామాలు ఆడే నాయకులు ఎవరైనా ఉంటారా? ఇలాంటివి చాలా చేశాడు. జగన్ ది ధనబలం.. తెలుగుదేశానిది జనబలం. జనబలం ముందు ధనబలం నిలవలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్యకర్తలే సొంత ఖర్చులతో పార్టీ కోసం పనిచేశారు. బ్రహ్మం డంగా పోరాడి మంచివిజయం వచ్చేలా చేశారు. ఉగాది పంచాంగం ఎలా ఉండనుందో ముం దేచెప్పాను. ఉగాది.. రంజాన్ పండుగలు మన తెలుగుదేశానికి ముందేవచ్చాయి.
ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్ మాసంలో కఠోరదీక్ష చేసి, ఉపవాసం ఉండి, ఎక్కడికక్కడ ప్రతిరోజూ మసీదులకు వెళ్లినమాజ్ చేసే ముస్లింసోదరులకు మనప్రభుత్వంలో రంజాన్ తోఫా ఇచ్చాం.ఇప్పుడు తోఫా ఉందా? ఇమామ్, మౌజన్ లకు పారితోషికం ఇచ్చింది తెలుగుదేశంపార్టీనే. మసీదుల నిర్మాణం, మరమ్మతులకు ఆర్థికసాయంచేశాము. ఖబరిస్తాన్ ల నిర్మాణానికి డబ్బులిచ్చాం. ముస్లిం యువతులకు పెళ్లిళ్లకోసం 50వేలు ఇచ్చాం. ముస్లింసోదరు లతో కలిసి అందరూ సంతోషంగా రంజాన్ జరుపుకోండి. జగన్, అతనిపార్టీ గాలికే.. గాలికి కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆశయాలు, పద్ధతిలేని పార్టీ, స్వార్థంతో పుట్టిన పార్టీ స్వార్థంతోనే పోతుంది. మనం గెలుపుకోసం పటిష్టమైన వ్యవస్థ తో ముందుకెళ్తున్నాం. 25 వేల ఓట్లకు ఒక క్లస్టర్.. 5వేలఓట్లకు ఒక యూనిట్, బూత్ కు ఒక బూత్ కమిటీ. 30 కుటుంబాలకు ఒక కుటుంబ సాధికార సారథి. సారథుల్లో పురుషులు.. మహిళ లు ఉండాలి. వారిద్దరూ కలిసి అన్నికుటుంబాలను ఏకతాటిపైకి తీసుకురావాలి.
పార్టీ కోసం మీరు కష్టపడుతున్నారు. సమాజంకోసం ఎంతో శ్రమిస్తున్నారు. మరలా ప్రభుత్వం వస్తే పైరవీలు చేసేవారు ముందుకొచ్చి, పనిచేసేవారు వెనకే ఉండిపోతారు. ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఒక లా.. అప్పుడు ఒకలా ఉంటారు. అందుకే ఈ వ్యవస్థతో ఇప్పుడు పకడ్బందీవిధానానికి శ్రీకారం చుట్టాము. ఎవరైతే పార్టీకోసం పనిచేశారో, వారిని వెతుక్కుంటూ పార్టీనే వారివద్దకు వెళ్తుంది. నాయకుడు సమర్థుడు అయితే, నియోజకవర్గం బాగుపడుతుంది. మండలం, గ్రామాలు బాగుం టాయి. అతను అసమర్థుడు అయితే అవి మనచేతి నుంచి జారిపోతాయి. అందుకే వారిపై కూడా నిఘాపెట్టాం. మే నెలనుంచి నెలనెలా క్లస్టర్ ఇన్ ఛార్జ్ ల రిపోర్టులు వారికే పంపిస్తాం. యూనిట్ ఇన్ ఛార్జ్ లకు పంపిస్తాం. తద్వారా పనితీరు మెరుగవుతుంది. నా డాష్ బోర్డ్ లో మీ అందరి పేర్లు ఉంటాయి. ఎవరు బాగా పనిచేశారో ఎప్పటికప్పుడు తెలుస్తుంది. కొంతమంది ఎప్పటినుంచో నాకు కనిపిస్తున్నారు. వారు కనిపించినప్పడు బాగాచేస్తారని అనుకుంటాం.. కానీ క్షేత్రస్థాయిలో వారిపనితీరు మాత్రం అధ్వాన్నంగా ఉంటుంది.
ఇకపై పనిచేసేవారినే గౌరవిస్తాం. మొదటి ప్రాధాన్యత వారికే ఇస్తాం. నా కుటుంబ సభ్యులు తెలుగుదేశంసభ్యులు. 40ఏళ్లు గా పనిచేస్తున్న మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. అధికారంలోకి వస్తే నేను మారి పోతాను అనే భావన మీలో ఉంది. రాష్ట్రంబాగుకోసం పనిచేశానుతప్ప, ఎవరికో మేలుచేయ డానికి నేను పనిచేయలేదు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే, 2029నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రపం చంలోనే అగ్రస్థానంలో నిలిచేది. రాష్ట్రంపై శ్రద్ధపెట్టి, మీకు ఎక్కువసమయం ఇవ్వలేకపోయా ను. ఇకపై అలాజరగదు. మాకార్యకర్తల్ని ఆదుకోవడం నాబాధ్యతగా భావించి దాన్ని తూచా తప్పకుండా నెరవేరుస్తాను. అదిజరగాలంటే రాష్ట్రంలో సైకిల్ రావాలి. జగన్ స్కిల్ డెవలప్ మెంట్ పై ఏదేదో చెబుతున్నాడు. గుజరాత్ లో ఆ ప్రాజెక్ట్ అమలైంది. రాష్ట్ర ప్రభుత్వవాటాగా ప్రాజెక్ట్ అమలుకోసం రూ.371కోట్లు విడుదలచేశాం. బోల్టులు, నట్లుతోసహా స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణాకేంద్రాల్లో అన్నీ ఉండేలాచేశాం. టీడీపీవారికి షెల్ కంపెనీల నుంచి నిధులు వచ్చాయా? ఏకంపెనీల నుంచి వచ్చాయో చెప్పు జగన్ రెడ్డి. తెలుగుదేశంపార్టీ ఏంచేసినా ప్రజలకోసం..రాష్ట్రంకోసమే చేసింది. ఏదో జరిగిపోయిందని కరుడుగట్టిన నేరస్తులు అవాస్తవాలతో ప్రజల్ని మభ్యపెట్టాలనిచూస్తే, మనం ధీటుగా స్పందించాలి. తెలుగుదేశం పార్టీ ఎక్కడా, ఎప్పుడూ తప్పు చేయదు.
డిజిటల్ కరెన్సీ అమలుపై ప్రధానికి నివేదికఇచ్చాను. ఆసమయంలో రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, కొందరు మనపై విషప్రచారంచేస్తారని, డిజిటల్ కరెన్సీ అమలుచేస్తే రాజకీయనేతలు అవినీతికి పాల్పడే ఆస్కారం తక్కువగా ఉంటుందనిచెప్పాను. అవినీతిపరులకు అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడుకూడా 2000రూపాయల నోటు రద్దు చేయాలి. మండలవిభాగం నుంచి బూత్ లెవల్ వరకు పనిచేసేవారందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలతో ఓటువేయించే శక్తివారికే ఉంది. దానికోసం నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకుల్ని ఎంపికచేయాలి. నియోజకవర్గంలో ఉండే 11, 12 క్లస్టర్ ఇన్ ఛార్జ్ లు, 50 మంది క్లస్టర్లు, అందరూ సమర్థులై ఉండాలి. ఒకపక్క ఇదిచేస్తూనే కుటుంబసాధికారసారథులు ప్రజలతో మమేకంకావాలి. అన్నీతెలుసు అనేవ్యక్తికి పతనం త్వరగా వస్తుంది. నిత్యం ఏదోఒకటి నేర్చుకునేవారు నిత్యవిద్యార్థులే జీవితంలో త్వరగాపైకి వస్తారు. నేర్చుకోవడం మన బాధ్యత.
ప్రజాస్వామ్యంలో మనం సమర్థవంతంగాపనిచేస్తేనే, ప్రజలకు మంచిచేయగలుగుతాం. ఇది వరకు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే ఎగతాళిచేశారు. ఈరోజు సెల్ ఫోన్ లేకుండా ఎవరైనా ఉన్నారా? భార్యాభర్తలు విడివిడిగా ఉండగలరుగానీ, సెల్ ఫోన్లు లేకపోతే ఉండలే రు. ఐటీ సాంకేతికత వల్ల దేశం చాలాచిన్నదిగా మారింది. నేడు చాలామంది యువతులు ఇళ్ల ల్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ లక్షలుసంపాదిస్తున్నారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనల లతో మనం ముందుకుపోవాలి. పేదరిక నిర్మూలన కోసం పనిచేయాలి. మననాయకుడు ఎన్టీఆర్ వల్ల అనేక కార్యక్రమాలు అమలుచేయగలిగాం. పేదరికం లేని సమాజంచూడాలన్నది ఆయనకల. దాన్నినెరవేర్చేది టీడీపీ కుటుంబ సారథులే. సంక్షేమం…. అభివృద్ధి ఒకసారి పరుగులు పెట్టిద్దాం. పేదలను ఆర్థికంగా బలోపేతంచేస్తేనే రాష్ట్రం అభివృద్ధిచెందుతుంది. మీ ఆలోచనలకు రూపకల్పనచేసే బాధ్యతనాది.
ఇంకా మనకు సంవత్సరమే ఉంది. ఈ సంవత్సరంలో ప్రజల్ని చైతన్యంచేస్తూ ప్రతిఇంటికి పదిసార్లు వెళ్లాలి. ఎవరైనా వ్యతిరేకతతో ఉంటే, వారికి అర్థమయ్యేలాచెప్పాలి. జగన్ నవంబర్ లోనో, డిసెంబర్లోనో ఎన్నికలు పెట్టాలనుకుంటున్నాడు. దానికికూడా మనంసిద్ధంగా ఉండాలి. రాష్ట్రమంతా సైకిల్ గాలే వీయాలి. అన్నిస్థానాల్లో టీడీపీ స్వీప్ చేయాలి. ఛాలెంజ్ విసురుతున్నా.. దానికి మీరంతా సిద్ధంగా ఉండాలి. ఇంటింటికీ వెళ్లే మీకు 14ప్రశ్నలు ఇచ్చాం. అన్నింటినీ పూర్తి చేయమన్నాం. ప్రజలు ఏంచెబుతారో, వారిసమస్యలు టీడీపీఅధికారంలోకి రాగానే పరిష్కరిస్తుందని చెప్పండి. మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యతఅమలుకోసం ప్రత్యేకంగా ఒకమంత్రినే పెడతాం. ఆహామీలకు అనుగుణంగానే ఎన్నికల మేనిఫెస్టోకురూపకల్పన చేస్తాం. ఒకపక్క వ్యక్తిగతసమస్యలు, మరోపక్క గ్రామసమస్యలు.. అన్నింటినీ రికార్డుచేస్తున్నారు. అదేసమయంలో ఈ ప్రభుత్వంలో రాష్ట్రానికి వచ్చిన సమస్యలు, ప్రజలుపడుతున్నఇబ్బందులపై మీరు మాట్లాడాలి.
10 మందిని ప్రభావితంచేసే విధానంతో మీరు ముందుకుపోతే, మీరే మీడియాగా మారతారు. మీగ్రామంలో, మీమండలంలో ఉండే సమస్య ల్ని వీడియోలరూపంలో మాకు తెలియచేయండి. మీగ్రామంలోని సమస్యల్ని అక్షరాలు, వీడి యోలరూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లండి. తద్వారా ప్రజల్లో చైతన్యంవచ్చి, మార్పువస్తుంది. ఆ మా ర్పే తెలుగుదేశం విజయానికి నాంది పలుకుతుంది. దుర్మార్గులకు ఒకసారి అధికారమిచ్చారు.. అదే వారికి చివరిసారి కావాలి. గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, విజయవాడ, మచిలీ పట్నం పార్లమెంట్లలోని అన్ని నియోజకవర్గాలలో ఉన్నసమస్యలు, ప్రజలకష్టాలపై మీరు మాట్లా డాలి. పల్నాడుజిల్లాలో ఫ్యాక్షనిజం ఎక్కువైంది. వరికపూడిసెల, బొల్లాపల్లి రిజర్వాయర్లు పూర్తి చేయాల్సి ఉంది. రైతుభరోసాకేంద్రాల పేరుతో రైతుల్ని దోచుకుంటున్నారు. రైతులకు గిట్టుబా టుధరలేదు. కృష్ణాజిల్లాలో ఇసుక మాఫియా ఎక్కువైంది. దానిపై పోరాడాలి. ఇష్టానుసారం నకిలీ మద్యం విక్రయిస్తూ, పేదలప్రాణాలతో ఆడుకుంటున్నారు.
చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తైతే 9లక్షలఎకరాలకునీరు అందేది. నూజివీడు, తిరువూరు నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాం తాలకు నీరు అందేది. వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు టీడీపీ హాయాంలోజరిగితే, ఆ పనులు నిలిచిపోయాయి. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితి అద్వాన్నంగా ఉంది. బందర్ పోర్ట్ పనులుప్రారంభించి, శంఖుస్థాపనచేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం మరలా శంఖుస్థాపనలు అంటోంది. ఏ.కొండూరులో కిడ్నీసమస్య ఉంది. దానిపై కూడామనం పోరాడాలి. కృష్ణలంక ముంపుకి గురికాకుండా మనప్రభుత్వంలో కొంత రిటైనింగ్ వాల్ కట్టాం. ఈ ప్రభుత్వం వచ్చాక దాని పనులు ఆపేసింది. పేదలకోసం బ్రహ్మండంగా టిడ్కోఇళ్లు కట్టించాము. వాటిని జగన్ పాడుపెట్టాడు. గన్నవరం విమానాశ్రయ విస్తరణకోసం రైతులుభూములిస్తే, వారికి అమరావతి లో భూములిచ్చాం. ఆపనులు కూడా ఆగిపోయాయి. అమరావతిరైతుల్ని నానాఇబ్బందులు పెట్టారు. ఇవే కాకుండా అనేకసమస్యలుఉన్నాయి. మనకు రాష్ట్రసమస్య పెద్దదిగా కనిపిస్తే, మరొకరికి పన్నులభారం, నిరుద్యోగం, పెరిగినఅప్పులు వంటివి సమస్యలుగా ఉంటాయి.
వాటిని మీరు అర్థంచేసుకొని సమర్థవంతంగా వారితోమమేకమై, వారిలోనమ్మకం కలిగించాలి. అప్పుడే మీకు, పార్టీకి మంచిపేరువస్తుంది. ప్రజలసమస్యల పట్ల సంఘీభావం తెలియచేస్తే, వారి కి ఒకబలం వస్తుంది. నాసమస్య తెలుగుదేశానికి తెలిసింది… మరోసంవత్సరం తర్వాతైనా అది పరిష్కారం అవుతుందనే నమ్మకం వారికి కలుగుతుంది. నేనుచెప్పింది విని వదిలేస్తానంటే కుదరదు. చైతన్యరథం పార్టీపేపర్ మీకు వస్తుంది… మీరు ఎంతసేపుదాన్నిచదువుతున్నారో దాన్నికూడా తెలుసుకుంటున్నాం. రోజుకి 2, 3 వీడియోలు పంపిస్తాం..వాటిని పదిమందికి అర్థ మయ్యేలాచెప్పి, వారినిచైతన్యం చేయాల్సింది మీరే. ఓటర్ వెరిఫికేషన్ చాలాముఖ్యం. ప్రతిఇంటినీ మ్యాపింగ్ చేస్తున్నాం. అది అయ్యాక ఇంట్లోని ఓటర్ల వివరాలతోపాటు, కుటుంబసారథి, బూత్ కమిటీ ఇన్ ఛార్జ్, రాష్ట్రపార్టీ అధికారప్రతినిధి మొత్తం వివరాలన్నీ ఉంటాయి. దానివల్ల సమాచారం ఆన్ లైన్లోఉంటుంది. ఎవరికి ఏ సమా చారం అవసరమో వారికి అంతవరకు మాత్రమే యాక్సిస్ ఇస్తాం. ఎవరికి ఏసమస్య ఉన్నా.. ఆ సమస్యను తెలియచేస్తే, నేరుగా రాష్ట్రపార్టీకి అదివస్తుంది. దానిప్రకారం మేంకూడా కార్యాచరణ అమలు చేస్తాం.
ప్రతికార్యకర్త రాజకీయ విశ్లేషకుడిగా తయారుకావాలి. సాధారణ ప్రజానీకానికి ఉన్నసమస్యలు.. వాటిలో దేన్ని టచ్ చేస్తే, ప్రజలు మీకు త్వరగా కనెక్ట్ అవుతారో తెలుసుకోవా లి. ఒక నాయకుడు ఎక్కువ పనిచేసినా తక్కువ ఓట్లువస్తాయి. ఒకరు తక్కువ పనిచేసినా ఎక్కువ ఓట్లు పడతాయి. కార్యకర్తల్లో నమ్మకం, ప్రజల్లో విశ్వాసం పొందడం మనకు ముఖ్యం. దానికి నాయకులప్రవర్తనే ముఖ్యమైనది. మా నాయకుడు మమ్మల్ని ఆదుకుంటాడనే భరోసా ఉంటేనేకార్యకర్తలు తెగించి పనిచేస్తారు. జగన్ పని అయిపోయింది. అతను ఇర్ రిపేరబుల్ … మనది అన్ స్టాపబుల్. పులివెందులలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనజెండానే ఎగిరింది. అక్కడ కూడా జగన్ రెడ్డి పని అయిపోయింది. మొన్నటివరకు 175 కి 175 అన్నాడు. ఇప్పుడు అతని కి మిగిలింది గుండుసున్నానే. మనగెలుపుతో వైసీపీపీలో లుకలుకలు మొదలయ్యాయి. ఆపార్టీ పతనం ప్రారంభమైంది.
మీరు అలాచేయవద్దు. ప్రజలతో మమేకంకండి.వారితో వినయంగా ఉండండి. వారికష్టాలు, ఇబ్బందులకు సంఘీభావం తెలపండి.అప్పుడే మీపై వారికి ఆదరణ, విశ్వాసం కలుగుతుంది. త్వరలోనే నియోజకవర్గాల వారీగా మీతో మాట్లాడతాను. బాగాపనిచే స్తే మెచ్చుకుంటాను.. తేడావస్తే కఠినంగానే ఉంటాను. తెలుగుదేశంపార్టీ ఆవిర్భావసభను హైదరాబాద్ లో జరుపుకోబోతున్నాం. 42వ ఆవిర్భావదినో త్సవాన్ని రెండురాష్ట్రాలకు కలిపి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నాం. 28వతేదీన పార్టీ పొలిట్ బ్యూరోసమావేశం నిర్వహిస్తున్నాం. మే28న మననాయకుడి శతజయంతి ఉత్సవాలు ఘనం గా నిర్వహించబోతున్నాం. ఒకయుగపరుషుడు పుట్టిన గడ్డఇది. తెలుగుజాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ ని గుర్తుంచుకుంటుంది. 5కోట్ల ప్రజల నినాదం ‘సైకోపోవాలి.. సైకిల్ రావాలి’. పంచుమర్తి అనురాధ వీరవనిత, ఆమెను వైసీపీ చిల్లర బ్యాచ్ దారుణంగా ట్రోల్ చేశారు. అనురాధ గెలుపు కుక్కకాటుకి చెప్పదెబ్బలా నిలిచింది.” అని చంద్రబాబు నాయుడు అన్నారు.