సీఐడీ కళంకిత అధికారులపై చర్యలు తీసుకొని బాధితులకు సత్వరం న్యాయం చేయాలని కోరుతూ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి లేఖ ద్వారా పిర్యాదు రాసిన తెదేపా నేత వర్ల రామయ్య
* అధికార పార్టీ కి అనుకూలంగా ఏపీ సిఐడి ఇటీవలి కాలంలో అర్ధరాత్రి అరెస్టులు చేస్తూ అపఖ్యాతి పాలౌతున్నది.
* సీఐడీ చర్యలు భారత రాజ్యాంగంలో పొందుపరచిన ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, మానవ హక్కులకు తీవ్ర ప్రమాదకరంగా తయారయ్యాయి.
* 2022 జూన్ 29 న సిఐడి పోలీసులు గార్లపాటి వెంకటేశ్వరరావు ను అక్రమ
అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన సిఐడి వికృత తీరుకు నిదర్శనం.
* సీఐడీ పోలీసులు దొంగల మాదిరి గోడ దుకడమే కాకుండా తలుపులు పగులగొట్టారు.
* లైట్లు ఆర్పివేసి వెంకటేశ్వరావు తల్లి, సోదరితో అనుచితంగా ప్రవర్తించారు.
* 41-A నోటీసు ఇచ్చేందుకు గోడ దూకి తలుపులు పగలగొట్టాల్సిన అవసరం ఏమిటి?
* 41-A నోటీసు అందజేసేందుకు హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారు?
* 30 జూన్ 2022 న ఉదయం మోకరాల సాంబశివరావును మంగళగిరిలో బలవంతంగా అరెస్టు చేశారు.
* అరెస్టు సమయంలో సాంబశివరావు భార్య బిడ్డకు పాలు ఇస్తున్నా బెడ్‌రూమ్‌లోకి బలవంతంగా వెళ్లారు.
* వెంకటేశ్వరరావు, సాంబశివరావులను వేర్వేరు గదుల్లో ఉంచి చిత్రహింసలకు గురిచేశారు.
* వెంకటేశ్వరరావును కొట్టడంతో తీవ్ర గాయాలై అంతర్గత
అవయవాలు దెబ్బతిన్నాయి.
* సాంబశివరావును సైతం తీవ్ర చిత్రహింసలకు గురిచేయడంతో అతని కాళ్లలో తీవ్రమైన అంతర్గత గాయాలయ్యాయి.
* సిఐడి సిబ్బంది బాధితుల బట్టలూడదీసి నగ్నంగా మార్చి చిత్రహింసలు పెట్టడం విస్మయం కలిగిస్తోంది.
* వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన పదవికి
రాజీనామా చేసినట్లు ఫోర్జరీ లేఖను తయారు చేశారనే సాకుతో సీఐడీ అధికారులు ఇదంతా చేశారు.
* దోపిడీ దొంగల్లా సీఐడీ అధికారులు వ్యవహరించాల్సిన అవసరం ఏముంది?
* కస్టడీలో బాధితులను చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఎంటీ?
* అధికార వైసీపీ నేతలకు ఒక రకంగా, మిగిలిన ప్రజలకు మరో రకంగా భారత రాజ్యాంగం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
* సీఐడీ కళంకిత అధికారులచే ఇటువంటి అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు.
* గతంలో గృహహింస కేసు నమోదైన సీఐడీ అడిషనల్ డీజీ PV సునీల్ కుమార్ వంటి కళంకిత అధికారులను ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని ప్రజలు అనుకుంటున్నారు.
* రెండు సామాజిక వర్గాల మధ్య శత్రుత్వం ప్రోత్సహించారని పివి సునీల్ కుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
* గార్లపాటి వెంకటేశ్వరరావును అర్ధరాత్రి అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన సిఐడి డిఎస్పీ కె. చెంచు రామారావు గతంలో సస్పెండ్ చేయబడ్డారు.
* ఆయనపై అనేక తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
* సిఐ జగదీష్ కూడా ఓ వివాహితను మోసం చేసి ఆమెతో బిడ్డను కనడం లాంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
* ఇలాంటి కళంకిత అధికారులను ప్రలోభపెట్టి వైసీపీ ప్రభుత్వం అసమ్మతిని అణిచివేసేందుకు ఉపయోగిస్తోంది.
* ఈ నేపథ్యంలో సీఐడీ దుశ్చర్యలపై సమగ్ర విచారణ జరిపించాలని అభ్యర్థిస్తున్నాను.
* కళంకిత అధికారులు సస్పెన్షన్‌లో ఉండేలా చర్యలు తీసుకోండి.
* బాధితులకు నష్టపరిహారం అందించి సత్వరమే న్యాయం జరిగేలా చూడండి.