Suryaa.co.in

Andhra Pradesh

రోశ‌య్య‌ జయంతి సందర్భంగా ఘ‌నంగా నివాళి అర్పించిన‌ వైసీపీ ఎంపీ

ఉమ్మ‌డి రాష్ట్రానికి సీఎంగా ప‌నిచేసిన కొణిజేటి రోశ‌య్య జ‌యంతిని పుర‌స్క‌రించుకుని సోమ‌వారం ఆయ‌న‌కు వైసీపీకి చెందిన కీల‌క నేత‌, న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీ‌కృష్ణ దేవ‌రాయ‌లు ఘ‌నంగా నివాళి అర్పించారు. రోశ‌య్య విగ్ర‌హానికి పూల మాల‌లు వేసిన యువ ఎంపీ… రోశ‌య్య గొప్ప‌ద‌నాన్ని కీర్తించారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా లావు ఓ ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేశారు.

రోశ‌య్యను వాక్చాతుర్యం, సమయస్ఫూర్తికి నిలువుటద్దంగా అభివ‌ర్ణించిన వైసీపీ ఎంపీ… అధికారంలో ఉన్నా, లేకున్నా తన గళాన్నే బలంగా ప్ర‌యోగించార‌ని కీర్తించారు. ఎవరినైనా కలుపుకొనిపోయే స్వభావం క‌లిగిన రోశ‌య్య‌.. అపార అనుభవం, విషయాలపై స్పష్టమైన అవగాహన, చక్కని భాష క‌లిగిన నేత‌గానే అభివ‌ర్ణించారు. ఆర్థిక మంత్రిగా సరికొత్త ఒరవడి సృష్టించిన రోశయ్య‌.. సీఎంగా, గవర్నర్ గా సేవలందించార‌ని ఎంపీ లావు పేర్కొన్నారు.

LEAVE A RESPONSE