Suryaa.co.in

Andhra Pradesh

వేమిరెడ్డితో టీడీపీ అగ్రనేతల భేటీ

-వేమిరెడ్డి దంపతులను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన నేతలు

తాజాగా వైసిపి కి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో జిల్లా టీడీపి అగ్రనేతలు మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగురు నారాయణ లు, టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపి నియోజకవర్గ ఇన్చార్జి లు మాగుంట లే అవుట్ లోని వీపీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వేమిరెడ్డి ను శాలువా, బొకే తో సత్కరించి, వేమిరెడ్డి దంపతులను తెలుగుదేశం పార్టీ లోకి ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన వీపీఆర్ చేరిక తేదీను వెల్లడిస్తామని తెలిపారు. టీడీపీ లో వీపీఆర్ కు తగిన గౌరవం ఉంటుందని నేతలు తెలిపారు.

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ, సంపాదించిన సొమ్మును ప్రజా సేవకు వినియోగిస్తారని, రాజకీయాల నుంచి ప్రతిఫలం ఆశించని వ్యక్తి వేమిరెడ్డిగారు అని అన్నారు. ఆయన్ను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు అరాచకంగా మారారని వ్యాఖ్యానించారు.

మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా ముఖ్య నాయకులందరం కలిసి వీపీఆర్‌ గారిని ఆహ్వానించామన్నారు. దీనికి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు సానుకూలంగా స్పందించారన్నారు. టీడీపీలో ఆయనకు సరైన గౌరవం దక్కుతుందని అన్నారు.

ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు వైసీపీకి రాజీనామా చేసిన తరుణంలో మేమంతా ఆయనకు మద్దతు ఇచ్చేందుకు వచ్చామన్నారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని అన్నారు.

కార్యక్రమంలో సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, కందుకూరు, కోవూరు, కావలి నియోజకవర్గాల ఇంఛార్జి లు నెలవెల సుబ్రహ్మణ్యం, కురుగొండ్ల రామకృష్ణ, పాసిం సునీల్ కుమార్, ఇంటూరి నాగేశ్వర రావు, పోలంరెడ్డి దినేష్ రెడ్డి, కావ్య కృష్ణా రెడ్డి లు ,టీడీపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, తాళ్లపాక రమేష్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పమ్మిడి రవికుమార్ చౌదరి, రాజా నాయుడు, నన్నే సాహెబ్, మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE