అప్పన్నకి జర్నలిస్టుల వినతి

సింహాచలం : రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి , ఈనాడు విలేకరులపై , అదే విధంగా ఈనాడు కార్యాలయంపై దాడులు చేసిన వారికి సద్భుద్ది ప్రసాదించాలని కోరుతూ పలువురు జర్నలిస్టులు సింహాద్రి అప్పన్నకు వినతిపత్రం ఇచ్చారు. గురువారం సింహాచలం తొలిపావంచా వద్ద జరిగిన కార్యక్రమంలో దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు . జర్నలిస్టులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నేతలు గూసిడి అవినాష్ బాబు, రౌతు రాంబాబు, జనసేన నేత మజ్జి సూరి బాబు , CITU నేత టి వి కృష్ణం రాజు, వి హెచ్ పి నేత పూడిపెద్ది శర్మ పాల్గొని మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులకు ఖండించారు, అదే విదంగా రక్షణ కలిపించాలని కోరారు. దాడులకు తెగబడిన దోషులని తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు .

Leave a Reply