Suryaa.co.in

Andhra Pradesh

జాతిపిత మహాత్మా గాంధీకి టీడీపీ నేతల నివాళి

అమరావతి :స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు నివాళులర్పించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నేతలునివాళి అర్పించారు. తెల్లదొరలపై అవిశ్రాంతంగా పోరాడి శాంతిమార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అని నేతలు ఈ సందర్భంగా కొనియాడారు. గాంధీ చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు.

కానీ ప్రస్తుతం జగన్ పాలనలో స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోయిందన్నారు. గాంధీ సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, టీడీపీ నేతలు దారపనేని నరేంద్ర బాబు, ఏ వి రమణ, పరుచూరి కృష్ణ, ఈట స్వామిదాస్, హసన్ భాష, కోడూరి అఖిల్, వెంకటప్ప, దేవినేని శంకర్ నాయుడు, కస్కుర్తి హనుమంతరావు, బొక్క నాగరాజు, బేతపూడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE