-ట్విట్టర్ లో సజ్జల పై విరుచుకుపడిన టిడిపి నేతలు…
వివేకా హత్యపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు, సీబీఐ-చంద్రబాబు సంబంధాలపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్లు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సజ్జలపై టీడీపీ నేతలు మూకుమ్మడి ట్విట్టర్ దాడి చేశారు. ఆ క్రమంలో ఎవరేమన్నారంటే..
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
‘‘ ఈ రోజు సునీత చంద్రబాబు పావు అన్నాడు, రేపు విజయమ్మ, షర్మిల కూడా చంద్రబాబు పావు అంటాడు.. సజ్జల లాంటి నీచుడి క్యారక్టర్ పురాణాల్లో కూడా ఉండదు ’’
మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి…
‘‘ అయ్యా అవినాష్ రెడ్డి చూసావుగా వీళ్ళు ఎంతటి ఉన్మాదులో.
ఈ రోజు ఇంటి ఆడ బిడ్డ సునీతను కూడా చంద్రబాబు పావు అన్నారు.
రేపు నిన్ను వేసేసినా వేసేస్తారు. సిబిఐ దగ్గరకు వెళ్లి నిజం ఒప్పుకుని, నీ వెనుక ఉన్న సైకో గాడి పేరు చెప్పేయ్. బాబాయ్ ఆత్మ అయినా శాంతిస్తుంది. ’’
మాజీ మంత్రి జవహర్…
‘‘ ఏంటి సజ్జలా వివేకా ఆత్మ క్షోభిస్తుందా ? క్షోభించిదా మరి ? అబ్బాయిలు వేసేస్తే, ఏ బాబాయ్ ఆత్మ అయినా క్షోభిస్తుంది ’’
మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న…
‘‘ నారసుర చరిత్ర అని సిగ్గు లేకుండా బురద జల్లిన మీకు, మీ సాక్షి పత్రికకు ఉన్న సిగ్గు గురించి మాట్లాడటం మర్చిపోయావే సజ్జలా ? ఆ రోజు చంద్రబాబు గారు చేయించారని చెప్పటానికి లేని సిగ్గు, ఈ రోజు మీ ఇంటి ఆడ బిడ్డ సునీత జగనాసుర రక్త చరిత్ర బయటపెడితే వచ్చిందా ?’’
బి టెక్ రవి…
‘‘ సిగ్గులు గురించి, ఎగ్గులు గురించి మాట్లాడే సజ్జల, వెనుకుండి మాట్లాడించే జగన్ రెడ్డి, టిడిపి పైన పింక్ డైమెండ్ దగ్గర నుంచి, డేటా చోరీ అంటూ ఎన్ని లత్కోర్ రోత రాతలు అయినా రాయించవచ్చు. సునీత తనకు ఉన్న అనుమానాలు, సిబిఐకి చెప్తే మాత్రం, జగన్ అండ్ కో తట్టుకోలేక పోతుంది.’’