Suryaa.co.in

Andhra Pradesh

మృతుడి కుటుంబానికి టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సెల్ ఆర్థిక సాయం

పెదకూరపాడులో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన అడుసుమల్లి బాల వెంకటేశ్వర్లు అనే యువకుడి కుటుంబానికి ఎన్ఆర్ఐ టీడీపీ ఆర్థిక సాయం అందించింది. గత నెలలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వెంకటేశ్వర్లు కుటుంబానికి టీడీపీ ఎన్ఆర్ ఐ విభాగం రూ. 8,71,200 ఆర్థిక సాయం చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ మోత్తాన్ని ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ప్రతినిధులు మృతుని కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఆర్ టీడీపీ ప్రతినిధులు వేమూరి రవి, ఎం.మల్లిక్, ఎ.వెంకట్, బుచ్చి రాం ప్రసాద్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE