Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి మహిళా ద్రోహి

– నాడు ఓట్ల కోసం అక్క చెళ్లమ్మలంటూ మాయమాటలు – అధికారంలోకి వచ్చాక మోసం
– వైసీపీ 3 ఏళ్ల పాలనలో మహిళలపై అఘాయిత్యం జరగని రోజు ఉందా?
– వైసీపీ నేతలు, కార్యకర్తలు, వాలంటీర్లే ఉన్మాదుల్లా మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు
– గత సారా ఉద్యమం స్పూర్తితో జగన్ రెడ్డిని గద్దె దింపే వరకు పోరాటం చేస్తాం
– వంగలపూడి అనిత, గద్దె అనురాధ

ఎన్నికలకు ముందు మహిళల తలపై ముద్దులు పెట్టి, బుగ్గలు నిమిరి అనేక హామీలిచ్చిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మోసం చేయటమేకాక మహిళలపై రోజూ అఘాయిత్యాలు జరుగుతున్నా కనీసం నోరుమెదపటం లేదని తెలుగు మహిళా రాష్ర్ి అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ….

నాడు మద్యపాన నిషేదమని ‎ చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేతే టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్మిస్తున్నారు.రాష్ట్రంలో మహిళలపై రోజూ అఘాయిత్యాలు జరుగుతున్నా…జగన్ రెడ్డి మాత్రం నాకు సంబందం లేదు, నేను ముఖ్యమంత్రిని కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. అమరావతి మహిళా రైతుల్ని పోలీసుల చేత బూటు కాళ్లతో తన్నించారు. వైసీపీ వాలంటీర్లు, వైసీపీ నేతలే ఊరికో ఉన్మాది, కాలకేయుల్లా..మారి మహిళలపై అత్యాచారాలు ,హత్యలకు తెగబడుతున్నారు. ఇదేనా వైసీపీ 3 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతి ? మూడేళ్ల పాలన పూర్తయిందని సంబరాలు చేసుకుంటున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు ఈ పాలనలో తమ కుటుంబంలోని మహిళలకు ఎంతమేర భద్రత ఉందో ఆలోచించాలి. ఎన్నికలకు ముందు ఇంట్లో అందరికీ అమ్మఒడి అని చెప్పిన భారతి రెడ్డి, ఇప్పుడు అమ్మఒడిని ఒక్కరికే పరిమితం చేస్తే ఎందుకు మాట్లాడటం లేదు? ఏలూరు లో 6 ఏళ్ల పాపపై వాలంటీర్ అత్యాచారం చేశాడు, గుంటూరులో రమ్యను పట్టపగలే ఓ ఉన్మాది గొంతు కోసి చంపాడు.

ఇలా రోజు ఎక్కడో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే మరో మహిళపై అఘాయిత్యం జరగదు కదా? కృష్ణారెడ్డి అనే కడప జిల్లా వైసీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ‎ యువతిని పెళ్లి పేరుతో గర్బవతిని చేసి మోసం చేసి చంపేందుకు సైతం ప్రయత్నించాడు. ఇలాంటి వారు పేట్రేగిపోవటానికి కారణం ఎవరు? 3 ఏళ్లలో 800 మంది మహిళలకు పైగా అత్యాచారాలు జరిగాయి ఆ వివరాలు ‎మహిళా కమీషన్ కి ఇస్తే వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? వైసీపీ పాలనలో ఆడబిడ్లలపై అత్యాచారాలు,అరాచకాల్లో రాష్ట్రం దేశంలో ముందు వరుసలో ఉంది. దిశ చట్టంతో 21 రోజుల్లో నిందితుల్ని శిక్షి‎స్తామని ఇన్ని ఏళ్లు గడుస్తున్నా.. ‎దిశ చట్టానికి చట్టబద్దత కల్పించటం చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.

మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా..‎ ముఖ్యమంత్రి ‎ నోరుమెదపటం లేదంటే… ఆయన క్యాబినెట్ లో ఉన్న మహిళా మంత్రులకు ఏ మాత్రం నైతిక విలువలున్నా వెంటనే రాజీనామా చేయాలి. మహిళలపై అత్యాచారాలు అరికట్టాల్సిన మంత్రులే… బాధ్యతారాహిత్యంగా మాట్లాడం బాధాకరం. అత్యాచారాలు యాదృచ్చికంగా జరుగుతాయని ‍హోంమంత్రి అంటే… ఒకటి రెండు రేప్ లకే రాద్దాంతమా అని ఇంకో మంత్రి రోజా అంటున్నారు. రేప్ లని ఈజీగా తీసుకునే మానసిక స్తైర్యం రోజాకు ఉన్నంతగా ప్రపంచంలో ఏ మహిళకు ఉండదు. ‎గుంటూరు జిల్లాలో తిరుపతమ్మ అనే మహిళపై అత్యాచారం జరిగితే ఆ కుటుంబానికి లోకేష్ అండగా నిలబడితే… జగన్ రెడ్డి మాత్రం నానా యాగీ చేస్తున్నారనటం సిగ్గుచేటు.

టీడీపీ హయాంలో గురజాలలో బాలికపై అత్యాచారం జరిగితే నిందితుడు ఉరి వేసుకునేలా చేశాం. పాలన అంటే అది. కానీ జగన్ రెడ్డి ఇంటి సమీపంలో యువతిపై అత్యాచారం కేసులో నిందితుడైన వెంకటరెడ్డిని ఇంత వరకు అరెస్టు చేయలేదు ? జగన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ ఎక్కడుంది? మద్యం అమ్మకాలు తక్కువగా ఉన్న చోట సారాపై దాడులు చేసి పీడీ యాక్ట్ లు పెడుతున్నారు. ‎ మద్యం పై వచ్చే ఆదాయంతో సంక్షేమ పధకాలు అమలు చేయటం ఇష్టం లేదని చంద్రబాబు కి ఇష్టం లేదని అసెంబ్లీలో జగన్ అన్నారు. అంటే మీరు అమ్మే ‎నకిలీ మద్యం తాగి భర్త, కోడుకులు అనారోగ్యానికి గురైతే ఆ డబ్బుతో వచ్చిన ఆదాయంతో ఇంట్లో ఆడవాళ్లకు సంక్షేమ పధకాలు ఇస్తారా?

ఆడవాళ్ల ఓట్లతో గెలిచి..వారిని నిట్టనిలువునా ముంచిన వైసీపీ ఆడవాళ్ల శాపానికి గురి కాక తప్పదు. వైసీపీ ఎమ్మెల్యేలే అధికారులపై దాడులకు పాల్పడుతున్నారు. వైసీపీ నేతలే ఊరికో ఉన్మాది, కాలకేయుల్లా మారి ఇస్టానుసారం వ్యవహరిస్తుంటే రాష్ట్రం భష్టుపట్టక ఏమవుతుంది? జగన్ రెడ్డి పాలనలో మహిళపై మహిళల పరిస్థితిపై అందరూ ఆలోచించాలి. ‎రాబోయే రోజుల్లో మహిళలకు మంచి రోజులు రావాలంటే మళ్లీ ‎చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని వంగలపూడి అనిత అన్నారు.

కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్, టీడీపీ మహిళా నేత గద్దె అనురాధ మాట్లాడుతూ…
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు చూస్తుంటే ఇది రావణ రాజ్యమా? కీచక రాజ్యమా? అన్పిస్తోంది. నాడు ఓట్ల కోసం మహిళల్ని అక్క చెళ్లమ్మలు అన్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వారి బతుకులు కుక్కలు చింపిన విస్తరి‎ చేశారు. అధికార పార్టీ నేతలే మహిళలపై అత్యాచారాలు చేస్తుంటే..రాష్ట్రంలో యధా రాజా తధా ప్రజా అన్నట్టు తయారైంది. చస్తుంటే సంధి మంత్రం వళ్లించినట్టు వైసీపీ నేతలు దిక్కు దివానం లేని దిశ మంత్రం పటిస్తున్నారు. దిశ ఒక బుస..చట్టబద్దత లేని దిశ చట్టం ఎవరిని రక్షిస్తుందో చెప్పాలి? ముఖ్యమంత్రి దావోస్ లో రాష్ట్ర ప్రగతి గురించి చెప్పే కన్నా అత్యాచారాల ఘనంకాలు చెబితే ఘనంగా ఉండేదేమో ఆయనకు కావాల్సింది ఏవైనా గణంకాలే కదా?

జగన్ రెడ్డి ఇస్తున్న ప్రకటనల్లో..రేపిస్ట్ ల భరోసా, దౌర్జన్యాల దీవెన, అత్యాచారాల ఆసరా హంతకుల నేస్తం, అని కూడా ప్రకటనలు ఇచ్చుకోండి. ఎందుకంటే పేపర్లో ప్రకటన పేజీ తిప్పగానే ప్రజలకు కనపించేవి అవే కదా. పోలీసుల్ని ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాలను వేధించటంపై కాకుండా వాళ్ల పని వాళ్లు చేసుకునే స్వేచ్చనిస్తే..కొంత మార్పొస్తొంది. గతంలో రాష్ట్రంలో సారా అరికట్టేందుకు మహిళలు ఏవిధంగా ఉద్యమం నడిపారో, ఆ స్పూర్తితో జగన్ రెడ్డి పాలనను అంతమెందించేందుకు తెలుగు మహిళలంతా పోరాటం చేస్తామని గద్దె అనురాధ అన్నారు.

LEAVE A RESPONSE