– ఎయిర్ పోర్టు లలో ఉడాన్ యాత్రి కేఫ్ ఏర్పాటు
– ఉడాన్ యాత్రి కేఫ్ తో తక్కువ ధర లు
సహజంగా ఎయిర్‌పోర్టులో టీ తాగినా.. వాటర్ బాటిల్ తీసుకున్నా.. సమోసా కొనాలన్నా రేట్లు గూబగుయ్యిమంటాయి. ఈ ఫిర్యాదులు గమనించిన కేంద్రం ఎయిర్‌పోర్టులలో ఉడాన్ యాత్రి కేఫ్ ను ఏర్పాటు చేసింది. దానితో అవి సామాన్యులకు సైతం అందుబాటులోకి రావడంతో, ప్రయాణికులు కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
విమానాశ్రయాల్లోని కేఫ్ లలో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ యాత్రి కేఫ్ ను ఏర్పాటు చేసింది. ఇందులో టీ కేవలం రూ. 10, వాటర్ బాటిల్ రూ. 10, కాఫీ రూ. 20, సమోసా రూ. 20 లకే విక్రయిస్తున్నారు. తాజాగా కోల్కతా లోని కేఫ్ ధరలు చూసి ఓ నెటిజన్ షేర్ చేయగా వైరలవుతోంది.. కాగా, ఎయిర్ పోర్టుల్లో వాటర్ బాటిల్ కూడా రూ. 100 లకు అమ్ముతున్నారని గత నెలలో ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్ లో సమస్యను లేవనెత్తారు. ఐతే, ఈ ఉడాన్ యాత్రి కేఫ్ లను దేశ వ్యాప్తంగా విస్తరించాల్సి ఉంది. మొత్తానికి తమ జేబు చిల్లు పడకుండా రక్షించినందుకు ప్రయాణికులు మోదీకి థ్యాంక్స్ చెబుతున్నారు.