Suryaa.co.in

Telangana

గర్భగుడిలో సింగర్ మధుప్రియ వీడియో షూట్

– హిందువుల ఆగ్రహం..

భూపాలపల్లి: సింగర్ మధుప్రియ వివాదంలో చిక్కుకుంది. ఆమెపై హిందువులు, బీజేపీ నాయకులు తీవ్రంగా మండి పడుతున్నారు. సింగర్ మధుప్రియను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో సాంగ్ షూట్ చేయడం వివాదానికి దారి తీసింది. అది కూడా భక్తులు దర్శనానికి రాకుండా గుడి తలుపులు మూసేసి గర్భగుడిలో సాంగ్ షూటింగ్ జరపడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మధు ప్రియ తీరుపై పలువురు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భగుడిలో సాంగ్ షూట్‌కు అనుమతి ఎవరు ఇచ్చారంటూ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A RESPONSE