– సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి
సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్న నేపధ్యంలో పునరుత్పాదక ఇంధన రంగంలో సాంకేతిక పురోగతిని అన్వేషించాలని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి అన్నారు. సుజిలాన్ ఎనర్జీ సహకారంతో సాంకేతిక విద్యా శాఖ బుధవారం పవన శక్తిని ఆవిష్కరణపై రాష్ట్ర స్ధాయి వెబ్‌నార్‌ను నిర్వహించింది.
కమిషనరేట్ నుండి నాగరాణి మాట్లాడుతూ రానున్న ఐదు సంవత్సరాల కాలంలో 4800 మెగా వాట్ల సామర్థ్యంతో రాష్ట్రంలో పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల స్దాపనకు అవసరమైన పెట్టుబడులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సుజిలాన్ ఎనర్జీ ఇంజినీరింగ్ హెడ్ ఎం రాజన్ కీలకోపన్యాసం చూస్తూ గాలి ద్వారా విద్యుదుత్పత్తి రానున్న కాలంలో మేలైన విధానం కానుందన్నారు. విండ్ టర్బైన్ జనరేటర్ లోని ప్రధాన వ్యవస్థలను వివరించారు.
టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సంయిక్త కార్యదర్శి వి.పద్మారావు, సెక్రటరీ (ఎస్‌బిటిఇటి) కెవి రమణబాబు, జాయింట్ సెక్రటరీ జివివిఎస్‌ఎన్ మూర్తి, డిప్యూటీ డైరెక్టర్ (ట్రైనింగ్, ప్లేస్‌మెంట్) డాక్టర్ ఎంఎవి రామకృష్ణ, సుజిలాన్ రాష్ట్ర హెచ్‌ఆర్ హెడ్ నానాజీ, ప్లాంట్ హెడ్ బాలాజీ, సిఎస్‌ఆర్ హెడ్ రామకృష్ణ, రాష్ట్రవ్యాప్తంగా 47 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల నుండి 1264 మంది విద్యార్థులు, 193 మంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు.