Suryaa.co.in

Features

తీరం చేరని నావలు

ఎందుకో మెలకువ వచ్చింది. లీలగా మాటలు వినబడుతున్నాయి. వైదేహి ఏడుస్తూ అంటోంది, నాన్న బాగా మంట, కష్టంగా వుంది. భరించలేకున్నాను. అప్పారావుగారు చిన్నగా చెబుతున్నారు , లేదమ్మా ఇంకొంచెం సేపు ఓర్చుకో, డాక్టరుగారు త్వరగా అయిపోతుందన్నారు.
చీకటిపడిన తరువాత, దసరా సెలవలకి ఇంటికి రావటం వలన విషయం అర్ధం కాలేదు. అమ్మ సాయంత్రమే వినుకొండలో పెళ్లి అని వెళ్ళింది. చిన్నగా బయటికి తొంగి చూశాను . వైదేహికి చిన్నవయసులోనే పెళ్లి చేశారంట. చాల చక్కగా చలాకీగా ఉంటుంది. పోయినసారి వచ్చినప్పుడు చూశాను, కానీ పెళ్లి అయ్యిందని తెలియదు. భర్త మానసిక కురూపి అట, ఎప్పుడు అనుమానం తో వేధిస్తుంటే, తట్టుకోలేక రెండేళ్లుగా వాళ్ళ నాన్న దగ్గర ఉంటోంది. ఇప్పుడు భర్త మహాశయుడు తాకీదు పంపాట్ట వెంటనే రమ్మని, లేదంటే విడాకులే అని. వైదేహి కాళ్ళ వేళ్ళ పడిందట , ఒక రెండొందలిస్తే ఇంటిదగ్గరే ఇడ్లిలు అమ్మి బ్రతుకుతానని. మధ్య తరగతి ఆచారం ప్రకారం తండ్రి, భర్త దగ్గరికి వెళ్లాలనేసరికి దారి లేక, కిరసనాయిలు పోసుకొని అంటించుకొంది. తరవాత తెలిసింది అప్పారావు చందాలు వసూలు చేసి, దహన ఖర్చులకి వుంటాయని వైదేహిని హాస్పిటల్లో కూడా చేర్చలేదని. శివా!
గత ఇరవై ఏళ్లుగా నిండా బట్టపోయి చినిగిన బట్టలు ఫ్యాషన్ అయినా, అవసరమున్న లేకున్నా అమ్మాయిల బొమ్మలు, అడుగుకొక ఛానల్ ఉన్నా…దిశా, వర్షిత, వైదేహిల కథలు తీరం చేరని నావలేనా ?
తీరం చేరేదెప్పటికి?

– కామేష్ బద్రి, ( అట్లాంటా, అమెరికా)

LEAVE A RESPONSE