Suryaa.co.in

Telangana

హెల్త్ ఛాంపియన్ గా తెలంగాణ..

దేశంలోనే వైద్యరంగంలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రం అని మరోసారి రుజువైంది.యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా రెండు కేటగిరీల్లో తెలంగాణ చాంపియన్ గా నిలిచింది. తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ వైద్య రంగం పటిష్టమైందని మరోసారి చాటి చెప్పింది.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం “హెల్దీ అండ్ ఫిట్ నేషన్” క్యాంపెయిన్ ను ప్రారంభించింది.నవంబర్ 16 తేదీ నుండి డిసెంబర్ 13 వరకు జరిగిన ఈ క్యాంపెయిన్ లో సబ్ సెంటర్ స్థాయిలో మూడు లక్ష్యాలను నిర్దేశించింది.
ఒక సబ్ సెంటర్ పరిధిలో కనీసం 100 మందికి NCD (నాన్ కమ్యూనికబుల్ డిసీసెస్) స్క్రీనింగ్ చేయడం.
సబ్ సెంటర్ పరిధిలో 10 వెల్నెస్ యాక్టివిటీస్ నిర్వహించడం.
సబ్ సెంటర్ పరిధిలో కనీసం 100 డిజిటల్ ఐడిలు సృష్టించడం.
వీటిలో.. తెలంగాణ వెల్నెస్ యాక్టివిటీస్ లో దేశంలోనే మొదటి స్థానంలో, NCD స్క్రీనింగ్ లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలోని సబ్ సెంటర్ల పరిధిలో వైద్య సిబ్బంది ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
సోమవారం (డిసెంబర్ -13) యూనివర్సల్ హెల్త్ కవరేజి డే-2021 ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అవార్డులను బహూకరించింది. కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాజేష్ భూషణ్, NHA CEO rs.శర్మ, NHM ASMD వికాస్ శీల్ తదితరుల చేతుల మీదుగా రాష్ట్ర సిబ్బంది అవార్డులు అందుకున్నారు.

LEAVE A RESPONSE