నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ..

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది.. ప్రపంచాన్ని భయపెడుతోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌తో పాటు.. పలు కీలక అంశాలపై చర్చించనుంది కేబినెట్.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ నియంత్రణ చర్యలపై ఫోకస్‌ పెట్టనున్నారు.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు, టెస్టులు, ట్రేసింగ్‌.. క్వారంటైన్‌ తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.. కరోనా టెస్టులు పెంచే అవకాశం ఉండగా… మాల్స్‌, థియేటర్లు, పబ్‌లపై నియంత్రణా చర్యలు చేపట్టే విధంగా ఓ నిర్ణయానికి రానున్నట్టుగా సమాచారం. ఇక, వ్యాక్సినేషన్‌ పూర్తి కావొస్తుండడంతో.. బూస్టర్‌ డోస్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు.. వరి కొనుగోలు వేగవంతంపై మంత్రివర్గం చర్చించనుంది. యాసంగి సీజన్‌లో వరి పంటపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ నిర్ణయానికి రానుంది.. ధాన్యం కొనుగోళ్ల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.