-కబడ్డీ ఆటల ప్రారంభంలో కబడ్డీ కబడ్డీ అన్న మంత్రి ఎర్రబెల్లి
-ఆటలు ఆరోగ్యాని ఇస్తాయి
-చదువుతో పాటు ఆటలు ముఖ్యం
-తెలంగాణ ప్రభుత్వం ఆటలను బాగా ప్రోత్సహిస్తుంది
-మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉంటారు… అభివృద్ధిలో ముందంజలో ఉంటారు… వాటితో పాటు ఆటల్లో చురుకుగా ఉంటారు… ఓటమి లేకుండా ఆటలు ఆడడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనే మన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి నియోజకవర్గం, వావిలాల గ్రామంలో మూడు రోజులపాటు జరిగే జిల్లాస్థాయి కబడ్డీ ఆటలను నేడు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ..కబడ్డీ అంటూ కూతబెట్టి, ఆట ఆడారు.
కబడ్డీ ఆటలోనూ, వాలీబాల్ ఆటలోనూ, ఫుట్బాల్ ఆటలోనూ కెప్టెన్ గా ఉన్నానని, ఆటలంటే తనకు చాలా ఇష్టమని అందుకే ఆరోగ్యంగా ఉన్నానని, మీరు ఆటలను ఆడాలని, ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రానికి పేరు తేవాలని వారిలో స్ఫూర్తిని రగిలించారు. ఆటల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాటలు..
జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే 40 టీముల క్రీడాకారులకు అభినందనలు. క్రీడల్లో ఉండాలి..అపుడే ఆరోగ్యం ఉంటుంది. చదువు ఎంత ముఖ్యమో…క్రీడలు అంతే ముఖ్యం. కబడ్డీ, వాలీబాల్, ఫుట్ బాల్ ఆటల్లో కెప్టెన్ గా ఉండేవాణ్ణి. అప్పట్లో వాలీబాల్ జిల్లా స్థాయి అధ్యక్షుడుగా నేన, ప్రధాన కార్యదర్శిగా కడియం శ్రీహరి ఉన్నాము. దేవరుప్పులకు కబడ్డీ టీమ్ గా వచ్చాం. వరంగల్ జిల్లా కబడ్డీ జట్టు ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చింది. ఎమ్మెల్యేలకు కూడా ఆటలు ఆడిస్తారు.ఆ పోటీలలో అన్ని ప్రైజ్ లు నాకే వచ్చేవి. అందుకే ఆరోగ్యంగా ఉన్నాను.
సీఎం కేసీఆర్ తెలంగాణలో కబడ్డి క్రీడను ప్రోత్సహించాలి అని, ఆటలను ప్రోత్సహించాలని, ప్రతి ఊర్లో క్రీడల కోసం ఎకరం భూమి కేటాయించి, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. 3500 ఏళ్ల కింద వాల్మీకి వల్మిడి గుట్ట మీద రామాయణం రాశారు. వల్మిడినీ రూ.20 కోట్లతో అభివృద్ది చేశాం. శ్రీరామ నవమి రోజున ప్రారంభం చేస్తున్నాం. మీరు తలంబ్రాలు తీసుకుని ప్రతి ఇంటి నుంచి రావాలి. బమ్మెరలో పోతన పుట్టాడు. భాగవతం రాసింది పోతన. వీళ్ళు మన దగ్గర ఉండడం మన అదృష్టం. రూ.20 కోట్లతో అభివృద్ది చేస్తున్నం. 10 కోట్ల ఖర్చుతో సోమ నాథుని విగ్రహం 22 అడుగుల ఎత్తుతో పెడుతున్నాం. వావిలాలకు చరిత్ర ఉంది. మన చరిత్రను కాపాడుకోవాలి. గంట అభినయ సాయిరాం జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న బోతున్నాడు. అభినందనలు… శుభాకాంక్షలు. ఓడిపోతే బాధ పడకుండా ఛాలెంజ్ గా తీసుకుని ఆడాలి.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు నవీన్, సర్పంచ్ శ్రీమతి గంట పద్మ – భాస్కర్ తదితరులు ఉన్నారు.