మంత్రి నాగార్జున దళిత ద్రోహి

– జగన్ రెడ్డి మెప్పు కోసం జాతికి ద్రోహం చేస్తున్నాడు
– ఎం.ఎస్.రాజు

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తన పదవి కాపాడుకునేందుకు సొంత సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిధులు రూ.7 వేల కోట్లు దారిమళ్లించిందని ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేస్తే మంత్రి తేలుకుట్టిన దొంగలా మౌనం వహించడం దేనికి నిదర్శనం? నోరెత్తితే తన పదవి ఊస్టింగ్ అవుతుందని కాదా? జగన్ రెడ్డి అత్యంత కర్కశంగా ప్రశ్నించే గళాల గొంతు నొక్కడానికి తీసుకొచ్చిన జీఓ నెం 1 ను సస్పెండ్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేస్తే పదవిని కాపాడుకునేందుకు, జగన్ రెడ్డి మెప్పు పొందేందుకు వెంటనే స్పందించారు. దళితులకు అన్యాయం జరిగితే మాట్లాడని మంత్రి, ఇప్పుడు మాట్లాడడం జాతికి ద్రోహం చేసినట్లు కాదా?

తన సిఎం పదవికి బీటలు వారుతున్నాయనే భయంతోనే ఏ1… జీవో 1 తెచ్చారు. ఇది పేదల ముసుగులో ప్రజాస్వామ్యం గొంతునొక్కడానికి తెచ్చిన జీవో. పేదల కోసమే జగన్ జీవో తెచ్చాడని మేరుగ చెప్పడం సొంత సామాజిక వర్గాన్ని జీఓ-01కు బలిపశువులను చేయడమే. దేశంలోనే అతి పెద్ద పెత్తందారు అయిన జగన్ రెడ్డి పేదల కోసం జీవో తెచ్చాడంటే ఎలా నమ్మాలి? పేదల భూములు లాక్కుని అసెంబ్లీ సాక్షిగా దొరికిన చరిత్ర జగన్ రెడ్డి కుటుంబానిది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో 21 వేల మంది పేదలు ఉపాధి దొరక్క ఆత్మహత్యలకు పాల్పడ్డారని పార్లమెంటు సాక్షిగా రుజువైంది. జగన్ రెడ్డి మోసకారి సంక్షేమం, పరిపాలన, జగన్ రెడ్డి నిజస్వరూపం పార్లమెంటులో బయటపడినా..మంత్రులు మాత్రం జగన్ రెడ్డిని వెనకేసుకు రావడం తమ సామాజిక వర్గాలకు ద్రోహం చేయడం కాదా? ఈ దగుల్బాజీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు, హత్యలు చేస్తున్న పరిస్థితుల్లో సొంత సమాజికవర్గానికి అండగా నిలబడాల్సిన మంత్రి, జగన్ రెడ్డిని వెనకేసుకురావడం దళితులకు ద్రోహం చేసినట్లు కాదా? ఒక దళిత శాసన సభ్యుడి తల్లి శీలాన్ని శాసనసభా వేదిక శంకించిన మంత్రి మేరుగ నాగార్జున దళిత ద్రోహిగా మిగిలిపోతాడు. దళితులకు అన్యాయం చేసిన ఏ ఒక్కడూ రాజకీయాల్లో మనుగడ సాధించినట్లు దాఖలాలు లేవు. మంత్రి నాగార్జున ఎన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పినా జగన్ రెడ్డి మెప్పు పొందవచ్చేమో కాని, దళితుల అభిమానాన్ని పొందలేడు. జగన్ రెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున ఇద్దరూ దళిత ద్రోహులే. వీళ్లను రానున్న ఎన్నికల్లో దళితులు ఇంటికి సాగనంపడం ఖాయం..

Leave a Reply