దీపాలతో హారతి ఇవ్వవచ్చా?

కర్పూర హారతి కాకుండా దీపహారతి ఇచ్చే సంప్రదాయం కూడా మనకు ఉంది. ఆవునేతిలో తడిపిన వత్తిని వెలిగించి హారతిస్తారు ఇందుకోసం రెండు, మూడు ఐదు, ఏడు ఇలా బేసి సంఖ్యలలో దీపాలు వెలిగిస్తారు.
అత్యధికంగా నక్షత్ర హారతి అంటే ఇరవై ఏడు ఒత్తులతో హారతినిస్తారు. అయిదు కంటే ఎక్కువ దీపహారతులను సాధారణంగా ఆలయాల్లోనూ, నదీహారతుల్లోనూ మాత్రమే ఇస్తారు. హారతి పళ్లేలను రూపొందించిన విధానాన్ని బట్టి ఆయా పేర్లతో పిలుస్తారు. నాగదీపం, రథదీపం, పురుషదీపం, మేరు దీపం, పంచబ్రహ్మదీపం, గజ దీపం, వృషభ దీపం, కుంభ హారతి, నేత్ర హారతి, బిల్వహారతి, రుద్ర, చక్ర, నారాయణ నవగ్రహ హారతుల వంటివి ఎన్నో ఉన్నాయి.

హారతుల్లో రకరకాలున్నాయి. వత్తుల సంఖ్యను బట్టి హారతులకు పేర్లున్నాయి.
నంది హారతి – 3
సింహహారతి – 3
పంచహారతి – 5
నాగహారతి – 5
నేత్రహారతి – 2వత్తులు
బిల్వ హారతి – 3
కుంభహారతి – 3
రుద్రహారతి – 11
నారాయణ హారతి – 16
చంద్రహారతి 16
నక్షత్ర హారతి – 27
వృక్ష హారతి 32
రథహారతి -632
హారతి ఉత్సవాలలో, ఆలయాలలో ఒత్తులతో దీపహారతి ఇచ్చినప్పటికీ, చిట్టచివరిగా అఖండ కర్పూర హారతికూడా తప్పనిసరిగా ఇస్తారు.

– కొలిపాకుల సతీష్ బాబు

Leave a Reply