-మంత్రి కొప్పుల ఈశ్వర్
-రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా. కే.వాసుదేవ రెడ్డి చేతుల మీదుగా వికలాంగులకు సహాయ ఉపకరణాల ఉచిత పంపిణీ
ప్రభుత్వలు విధిగా పేదా వర్గాలను ఆదుకోవడానికి పని చేస్తూనే ఉంటాయి కానీ ప్రవేట్ కంపెనీలు వికలాంగులకు మేమున్నామంటూ సహాయం చేయడానికి ముందుకు రావడం, ముఖ్యంగా వికలాంగులకు అండగా ఉండడం అభినందనీయమని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, దివ్యంగుల శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
మలక్ పేట వికలాంగుల సంక్షేమ భవన్ లో సోమవారం నాడు క్వాల్ కం మరియు నిర్మాన్ ఆర్గనైజషన్ సంస్థ సహకారంతో సీనియర్ సిటీజన్స్, వికలాంగులకు దాదాపు రూ.1.60 కోట్ల విలువగల 8 రెస్కు ఎమర్జెన్సీ వాహనాలు, కండరాల క్షీణతవ్యాధితో బాధపడుతున్న వికలాంగులకు రూ. 40 లక్షల విలువగల 50 బ్యాటరీ వీల్ చైర్లు, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ద్వారా ప్రభుత్వ వసతి గృహాలలో ఉంటూ వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అంధ విద్యార్థులకు రూ. 76 లక్షల 14 వేల విలువగల 150 జా సాఫ్ట్ వేరుతో కూడిన లాప్ టాప్స్ ను, 75 -4జి స్మార్ట్ సెల్ ఫోన్స్ ను వికలాంగులకు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల సహకార సంస్థకు సక్రమంగా బడ్జెట్ కేటాయింపులు జరిగేవి కావని కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ముఖ్యమంత్రి కేసీఆర్ iనాయకత్వంలో వికలాంగులకు ప్రథమ ప్రాధాన్యత కేటాయిస్తూ వారికి అధిక నిధులు వెచ్చించి అనేక సహాయ ఉపకారణాలు అందిస్తున్న చరిత్ర తెలంగాణ ప్రభుత్వానిదని కొనియాడారు. ప్రభుత్వం చేసే సహాయమే కాకుండా వివిధ కంపెనీల తోటి మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.
వికలాంగులకు ఏ సహాయ ఉపకరణాలు అందించిన అవి 100% ఉచితంగా అందిస్తున్నామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని వికలాంగులను కోరారు.ఈ మధ్యనే వికలాంగుల శాఖను ప్రత్యేక శాఖగా కేటాయించి ప్రభుత్వం వారికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 4%, సంక్షేమ పథకాల్లో 5% అమలు చేస్తున్నామన్నారు. క్వాల్ కం అండ్ నిర్మాన్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్ది మాట్లాడుతూ.. వికలాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీఎం కేసీఆర్ సహకారంతో ఇప్పటివరకు వికలాంగుల సహకార సంస్థ ద్వారా రూ.46.26 కోట్లతో 50,845 లబ్ది దారులకు 17 రకాల సహాయ ఉపకరణాలు ఉచితంగా అందించామని గుర్తు చేశారు. ప్రార్ధించే పేదల కన్నా సహాయం చేసే చేతులు మిన్న విధంగా వికలాంగులకు అండగా ఉంటామని ముందుకు వచ్చి గొప్ప మనసును చాటుకున్న కంపెనీలకు వారు ధన్యవాదాలు తెలిపారు. వికలాంగుల సేవ విశ్వ మానవ సేవ అని మానవ సేవయే మాధవ సేవగా బావించి ఇంకా వికలాంగులకు సహాయం చేసే కంపెనీ లు ముందుకు వచ్చే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మరియు దాతలు అందిస్తున్న సేవలను వినియోగించుకొని ఆర్థికంగా పైకి ఎదగాలని వికలాంగులకు సూచించారు.అంతకుముందు వారు సీనియర్ సిటిజన్స్ మరియు వికలాంగుల కాల్ సెంటర్స్ ను వికలాంగుల సంక్షేమ్స్ భావన్లో ని రెండవ అంతుస్తులో టోల్ ఫ్రీ నెంబర్ల కాల్ సెంటర్ల ను ప్రారంభించి వాటి సేవలను అడిగి తెలుసుకున్నారు
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరి, సంస్థ ఎం.డి శైలజ,క్వాల్ కం. సీఈఓ నితిన్ శర్మ, కృష్ణకుమారి, నిర్మాన్ సంస్థ సంస్థ సిఈఓ మయూరు పట్నాల, భార్గవ్ సంస్థ జి.ఎం ప్రబంజన్ రావు, AD రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.