-టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వెనుక కేటీఆర్ మిత్ర బృందం ఉంది
-సిట్టింగ్ జడ్జీ తో విచారణ జరిపించాలి
-పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ రూ.లక్ష ఇవ్వాలి
-కేటీఆర్ పై బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప ఫైర్
-మా నౌకరులు మాకు కావాలి అన్న నినాదంతో నారాయణఖేడ్ లో నిరసన దీక్ష
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై కేటీఆర్ బాధ్యత వహించాల్సిందేనని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప డిమాండ్ చేశారు. లక్షల మంది అభ్యర్థులు మనోవేదనకు గురై తీవ్ర ఆందోళనలో ఉంటే సారా స్కామ్ లో ఇరుక్కున్న తన చెల్లిని కాపాడుకునేందుకు ఆయన ఢిల్లీ పోయారని సంగప్ప ఆరోపించారు.
30 లక్షల మంది యువకులు ఆందోళనలో అంటే తనకు చెల్లి ఎక్కువ అయిందా అని సంగప్ప ప్రశ్నించారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి నిర్వహించిన పరీక్షలు అన్నింటి పైన యువత అనుమానం వ్యక్తం చేస్తుందని అని చెప్పారు.కేవలం కవిత ఎంపీగా ఉన్న సమయంలో ఆమె నియోజకవర్గంలో ఒకే మండలం నుంచి 60 మందికి ఉద్యోగాలు వచ్చాయని, టిఆర్ఎస్ నాయకుల పిల్లలు, అధికారుల పిల్లలకు మాత్రమే ఉద్యోగాలు ఎట్లా వస్తాయని ఆయన ప్రశ్నించారు.
2018 ఎన్నికల ముందు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ ఏమైందని సంగప్ప ప్రశ్నించారు. ప్రతి యువకుడికి లక్షన్నర చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే అని ఆయన అన్నారు. యువకులు మనోవేదనకు గురై ఇబ్బంది పడోద్దని, వారికి న్యాయం జరిగే వరకూ బిజెపి పోరాడుతుందని అని సంగప్ప చెప్పారు. నారాయణఖేడ్ చౌరస్తాలో జరిగిన దీక్షలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, సీనియర్ నాయకులు మారుతి రెడ్డి, సాయిరాం, సుధాకర్, సతీష్, రమేష్ యాదవ్, పట్నం మాణిక్యం, గోపాల్ రెడ్డి, శ్రీకాంత్ సాగర్, నమిలిమెట్ శివ, వివిధ మండలాల బిజెపి అధ్యక్షులు భారీ సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.