– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప
– కంగ్టీ మండలం ముర్కుంజాల్ శివారులో పంట నష్టాలను పరిశీలించిన సంగప్ప
సంగారెడ్డి జిల్లాలో అకాల వర్షాలకు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప చెప్పారు. నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలో ఇటీవల కురిసిన వడగళ్ల వానలో నష్టపోయిన పంటచేలను స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. ముర్కున్జాల్లో వడగళ్ళవానకి నేలకొరిగిన మక్క పంట గురించి రైతుతో మాట్లాడి తెలుసుకున్నారు. పాల దశలో ఉన్న మక్కపంట నేలకొరవడంతో రైతు తీవ్రంగా నష్టపోయినట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయకపోవడం వల్ల రైతులకు పంట నష్టపరిహారం అందకుండా పోతుందని సంగప్ప పేర్కొన్నారు.
ప్రధానమంత్రి పథకాన్ని అమలు చేయకపోయినా సరే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట నష్టం అంచనా వేసి రైతులకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ పంట నష్టం పరిశీలనలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, సీనియర్ నాయకులు సాయిరాం, దత్తాత్రి, పండరి, గోపాల్ రెడ్డి, రమేష్ యాదవ్ తో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు.